అంగన్‌వాడీలకు ప్రభుత్వం తీపి వార్త… వారి ఖాతాల్లో రూ.2 లక్షలు

అంగన్‌వాడీ (Anganwadi) ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా వరాల జల్లు కురిపించింది.


ఈ మేరకు అంగన్‌వాడీల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిటైర్ అయ్యే ప్రతి అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, అదేవిధంగా హెల్పర్‌కు రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారు. వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డియర్‌నెస్ అలవెన్స్ (DA)లలో ఒక దానని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష కూడా నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Dailyhunt
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.