నైజీరియాలో వరదలు 111 మంది మృతి

నైజీరియాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.


ఇళ్లులు, కార్లు, మనుషులు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 111 మంది మృతదేహాలను వెలికితీయగా… మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

గత సెప్టెంబర్‌లో కూడా ఇదే తరహాలో వరదలు ముంచెత్తాయి. అప్పుడు కూడా ఆనకట్టలు తెగిపోవడంతో 30 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే బోకో హరామ్ తిరుగుబాటుతో మానవతా సంక్షోభం ఏర్పడగా.. వరదలతో పరిస్థితి మరింత దిగజారింది. నైజీరియా తరచుగా వరదలను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల కారణంగా స్వల్ప కాలంలోనే భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా వచ్చిన వర్షాలు కూడా అలాంటివే. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.