బిగ్ అప్‌డేట్.. రాబోయే ఐఫోన్ 17 కాదు.. ఐఫోన్ 26 పేరుతో లాంచ్ అవుతుందా?

ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆపిల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్, WWDC జరుగనుంది. జూన్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ (iPhone 26) కోసం ఆపిల్ రెడీ అవుతోంది.


బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ఇటీవల ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కొత్త అప్‌డేట్ రివీల్ చేశారు.

ఆపిల్ OS పేరు పెట్టే విధానంలో మార్పుకు సంబంధించి ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. కంపెనీ ఐఫోన్ మోడళ్ల నంబరింగ్‌ను కూడా రీబ్రాండ్ చేయగలదా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అదేగానీ జరిగితే.. ఐఫోన్ 17కి బదులుగా ఐఫోన్ 26 ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయొచ్చు.

ఆపిల్ ఐఫోన్ 17 బదులుగా ఐఫోన్ 26కు మారవచ్చనే పుకార్లు వినిపించాయి. గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ iOS18, macOS15 వంటి వెర్షన్ నంబర్‌లను నిలిపివేయొచ్చు. కంపెనీ రాబోయే ఏడాదిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌కు సరికొత్త పేరు పెట్టనుంది.

ఉదాహరణకు.. ఆపిల్ అప్‌డేట్స్ iOS 26, iPadOS 26, macOS 26, watchOS 26, tvOS 26, visionOS 26 అనే పేర్లతో పిలుస్తారు. ఈ కొత్త నేమ్ స్టయిల్ అన్ని ఆపిల్ డివైజ్‌ల్లో అందుబాటులో తీసుకురానుంది. వినియోగదారులు, డెవలపర్‌లు ఏ వెర్షన్‌లు ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం, వివిధ ఆపిల్ డివైజ్‌లకు సొంత వెర్షన్ నంబర్లు ఉన్నాయి. ఎందుకంటే.. సాఫ్ట్‌వేర్ వేర్వేరు సమయాల్లో రిలీజ్ అవుతుంది. కొన్నిసార్లు గందరగోళానికి దారతీస్తుంది. అందుకే వెర్షన్ పేరులో సంవత్సరాన్ని వాడుతుంటారు. శాంసంగ్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ఆపిల్ మరిన్ని కొత్త ఫీచర్లపై టెస్టింగ్ చేస్తోంది. ఐప్యాడ్‌లో Mac మాదిరి ఇంటర్‌ఫేస్ ఉండవచ్చు. డెవలపర్లు స్మార్ట్ యాప్‌ల కోసం ఆపిల్ ఏఐ టెక్నాలజీని యాక్సెస్ చేయవచ్చు.

ఎయిర్‌పాడ్స్, సిరి కోసం లైవ్ ట్రాన్స్‌లేషన్, విజన్ ప్రో హెడ్‌సెట్‌పై ఐ-స్క్రోలింగ్, కొత్త అరబిక్-ఇంగ్లీష్ కీబోర్డ్, ఆపిల్ పెన్సిల్ కోసం డిజిటల్ కాలిగ్రఫీ టూల్, ఏఐ ఆధారిత బ్యాటరీ సేవర్, బ్రాండ్-న్యూ గేమింగ్ యాప్ వంటి ఇతర అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.