మీ కళ్ళు మృదువుగా ఎలాంటి మచ్చలు లేకుండా స్పష్టంగా మెరుస్తున్నాయంటే మీ శరీరంలో ఆరోగ్య సమస్యలు తక్కువని అర్థం. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగితే అన్ని అవయవాలకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందుతాయి.
అందుకే కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉంటే మీ మొత్తం ఆరోగ్యం బాగున్నట్లే లెక్క.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, అలారం లేకుండా స్వతహాగా మేల్కొనడం అనేది మంచి అలవాటు. దీని వల్ల మీ స్లీప్ సైకిల్ సక్రమంగా ఉందని తెలుస్తుంది. మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రలో ఇబ్బందులు లేదా అలారం మీద ఆధారపడటం వంటివి ఉంటే అవి ఆరోగ్య సమస్యలకు సూచనలు కావచ్చు.
మీ చర్మం సున్నితంగా ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోతే అది మంచి ఆరోగ్యానికి సంకేతం. శరీరంలో ఎక్కడైనా వాపు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చర్మంపై పసుపు పగుళ్లు, నల్ల మచ్చలు లేదా ఇతర గుర్తులు ఏర్పడవచ్చు. కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉంటే మీరు శారీరకంగా బాగున్నారని అనుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయాన్నే మల విసర్జన సాఫీగా జరిగితే అది మీ జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుందని సంకేతం. జీర్ణ సమస్యలు లేకపోతే మీ శరీరం మీరు తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకుంటుందని అర్థం. పేగుల్లో సమస్యలు ఉంటే మల విసర్జన కష్టంగా ఉండవచ్చు, కాబట్టి ఇది సాఫీగా ఉండటం ముఖ్యం.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. మూడ్ స్వింగ్స్ తక్కువగా ఉంటాయి. ఒత్తిడి, కోపం, చిరాకు, నిస్సహాయత వంటి ప్రతికూల భావోద్వేగాలు తగ్గినట్లయితే మీరు మానసికంగా కూడా బాగున్నారని అర్థం. మానసిక స్థితి స్థిరంగా ఉంటే శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం పడుతుంది.
ఏదైనా శారీరక ఇబ్బంది లేదా గాయం వచ్చినప్పుడు మీరు త్వరగా కోలుకుంటే అది మీ శరీరం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉందని సంకేతం. గాయాలు త్వరగా తగ్గిపోవడం.. శరీరం తగిన రీతిలో స్పందించడం ఆరోగ్యానికి చిహ్నం. దీని వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉందని అర్థం.
మీ శరీరం ఉల్లాసంగా, చురుకుగా ఉంటే ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. శారీరకంగా చురుకుగా కదిలే శక్తి ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు. శక్తివంతమైన శరీరం మంచి మానసిక స్థితి మీరు బాగున్నట్లు తెలియజేస్తాయి.
మంచి నిద్ర అనేది ఆరోగ్యానికి అత్యంత అవసరం. రోజూ అవసరమైనంత సేపు నిద్రపోవడం ద్వారా శరీరం విశ్రాంతి పొందుతుంది. అర్థరాత్రి వరకు నిద్రపోకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటివి మానసిక లేదా శారీరక సమస్యలకు సూచనలు కావచ్చు. అందువల్ల నాణ్యమైన నిద్ర గుండె, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
మీ గుండె ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనించాలి. రక్తపోటు, షుగర్ స్థాయిలను సరిగా నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజు వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బలోపేతం అవుతుంది. వీటిని గమనించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం.
ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు మీ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను తొందరగా గుర్తించి సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించగలుగుతారు.































