ప్రశాంతంగా పదవీ విరమణ చేయడానికి, మీరు 40 ఏళ్లలోపు నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక నైపుణ్యాలు ఇవి.

చాలా మందికి డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియదు. ఎక్కడ ఇన్వెస్ట్​ చేయాలో తెలియక అలాగే ఉండిపోతుంటారు. కానీ భవిష్యత్​ అవసరాలతోపాటు శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపేందుకు పొందుపు ఎంతో అవసరం.


అందుకే డబ్బును ఎలా ఆదా చేయాలో నేర్చుకోవాలి. సంపదను సృష్టించడంతోపాటు ఆ సంపదను రక్షించుకునే నియమాలు తెలుసుకోవాలి. అందుకే 40 ఏళ్లు నిండకముందే ఈ 5 ఆర్థిక నైపుణ్యాలను కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చింత లేకుండా హాయిగా పదవీ విరమణ చేయడంలో ఈ సూత్రాలు సహాయపడతాయి.

కుటుంబానికి సరైన రిస్క్ కవర్ ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. వృత్తి, కుటుంబ నిర్మాణం, ఆరోగ్య పరిస్థితులు, కెరీర్​ను బట్టి 6 నెలల నుంచి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలానికి అవసరమైన రిస్క్, మొత్తాన్ని లెక్కించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో కుటుంబానికి ఎప్పుడైనా అవసరమైతే ఇబ్బంది కలగకుండా సరైన ప్రక్రియ ద్వారా ప్లాన్​లు కొనుగోలు చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి పెట్టుబడులు, చిన్న పొదుపులు మొదలైన వాటి గురించి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుబడుల గురించి తెలుసుకొని వాటిలో వచ్చే లాభనష్టాలను అంచనా వేసే పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

మీరు మీ రాబడిని పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 5–10 సంవత్సరాల పెట్టుబడులకు FDలు సురక్షితమైనవని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి, పన్నులు చెల్లించిన తర్వాత ఇన్​ఫ్లేషన్​ కంటే కంటే ఎక్కువ రాబడిని సంపాదించకపోతే మీరు నష్టపోయినట్లేనని గుర్తించండి. FDలో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్​ చేస్తే సంవత్సరం తర్వాత రూ. 1,07,000 ఇస్తుంది. 30శాతం పన్ను తర్వాత మీకు రూ.1,04,900 లభిస్తుంది. కొనుగోలు శక్తి ప్రకారం ఏడాదికి లక్ష ఇన్వెస్ట్​ చేస్తే పన్నులు మినహాయించి మీరు కచ్చితంగా కనీసం రూ.1,07,000 లేదా అంత కంటే ఎక్కువ పొందితేనే సంపద సృష్టించినట్లు.

డబ్బు నిర్వహణలో చాలా మందికి ఎలాంటి ట్రైనింగ్​ ఉండదు. కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ డబ్బు నిర్వహణ నేర్చుకోవాలి. దేశంలో చాలా మంది పదవీ విరమణ కోసం పెన్షన్ ప్లాన్లు, F.I.R.E. లేదా SWPపై ఆధారపడతారు. పదవీ విరమణ కార్పస్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే ఏకైక విషయం. వాస్తవానికి, పెన్షన్ ప్లాన్లు, ఇతర పెట్టుబడి సాధనాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే నెలవారీ పెన్షన్ను ఎలా సృష్టించాలో తెలుసుకోవాలి.

ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పెరుగుతాయి. సాధారణంగా ప్రజలు తాము కార్పస్తో పదవీ విరమణ చేస్తామని భావిస్తుంటారు. వడ్డీని వాడుకుంటూ కార్పస్​ను ఎప్పటికీ అలాగే ఉంచుతారు. అయితే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని కార్పస్​ను పెంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. మీకు ఇప్పుడు 40 ఏళ్లు ఉండి మీ నెలవారీ నెలవారీ ఖర్చులు రూ. 50,000 ఉంటే.. మీ వద్ద రూ. 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలి. ఈ డిపాజిట్ 90 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది.

కాబట్టి, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తర్వాత అన్ని ఆదాయ ఎంపికలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ సౌకర్యవంతమైన పదవీ విరమణ కోసం మీ పొదుపును ఉపయోగించడానికి ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవడమే సులభమైన మార్గం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.