ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీ పొడిగింపుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
10వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
































