మైక్రో హ్యాబిట్స్‌.. మీకు వాకింగ్‌కు వెళ్లే సమయం లేదా.. ఇలా చేయండి!

Puri Musings || చిన్న చిన్న యాక్షన్స్‌ చేయడానికి మనకు సంకల్ప బలం, కోచ్‌, ప్రేరణ అవసరం లేదని.. మైక్రో హ్యాబిట్స్‌ ద్వారా వాటిని సాధన చేయవచ్చని అంటున్నారు పూరి జగన్నాథ్‌.


వివిధ అంశాలపై ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న ఆయన తాజాగా ‘మైక్రో హ్యాబిట్స్‌’ అనే దానిపై మాట్లాడారు.

”మైక్రో హ్యాబిట్స్‌ అంటే ఒకటి లేదా రెండు నిమిషాల్లో చేసే చిన్న చిన్న యాక్షన్స్‌ (Micro Habits Meaning). మీరు రోజూ వ్యాయామం, మెడిటేషన్‌, పుస్తకాలు చదవడానికి సమయం కేటాయించుకోవాలి. ఆ ఆలోచన రాగానే మన బుర్ర చాలా సాకులు చెబుతుంది. ఎందుకంటే, రోజూ వంద పనులతో చాలా బిజీగా ఉంటాం కాబట్టి. అయితే, షెడ్యూల్‌ పాడవకుండా, వాటి కోసం సమయం కేటాయించకుండా మైక్రో హ్యాబిట్స్‌ను తెలివిగా మన జీవితంలో ఇరికించాలి. చదవడానికి సమయం లేకపోతే నిద్రపోయే ముందు ఒకే ఒక పేజీ చదివి పడుకోండి. మెడిటేషన్‌ చేసే సమయం లేనప్పుడు ఉదయం మీరు కాఫీ తయారు చేసుకునే సమయంలో ఓ 30సెకన్లు దీర్ఘశ్వాస తీసుకోవచ్చు. ఇలాంటి బేబీ స్టెప్స్‌ చేయడం చాలా సులభం. మైక్రో హ్యాబిట్స్‌ అనేవి చాలా చిన్నవి. నిత్య జీవనంలో కనిపించవు”

”మీకు నవల రాసే సమయం లేకపోతే, రోజుకు ఒకే ఒక వాక్యం రాయండి. ఆ ఒక్క వాక్యం మీతో పుస్తకం రాసేలా చేస్తుంది. జీవితంలో మీకు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేయలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. మీరు చేయాలనుకున్న పెద్ద అలవాట్లను సైజ్‌ తగ్గించి చిన్న యాక్షన్స్‌ మార్చండి. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోతే స్నానం చేసే ముందు ఐదు పుషప్స్‌ చేయండి. లేదా ఫోన్‌ మాట్లాడుతూ ఒక్క నిమిషం గోడ కుర్చీ వేసేయండి. ఏ పనిలో ఉన్నా, మధ్యలో నీళ్లు తాగితే డీహైడ్రేషన్‌ అవ్వకుండా ఉంటారు

”మైండ్‌లో ఏదైనా కోట్‌ వస్తే, చిన్న పేపర్‌లో రాసి మీ ఫ్రిడ్జ్‌కు స్టిక్‌ చేయండి. నెల తర్వాత మీకు చాలా పోస్టులు కనిపిస్తాయి. ఇంట్లో పనికిరాని వస్తువు, రోజుకొకకటి తీసి అవతల పడేయండి. అది మీ ఫ్రిజ్‌లో ఉన్న యోగర్ట్‌ కావచ్చు.. ప్లాస్టిక్‌ బ్యాగ్‌ కావచ్చు.. ప్రయాణంలో ఉన్నప్పుడు ఏఐ ఓపెన్‌ చేసి, కొత్త విషయం తెలుసుకోవచ్చు. రోజుకు ఒకే ఒక స్పానిష్‌ పదం నేర్చుకోండి. ఏడాదికి తర్వాత స్పానిష్‌ మూవీ చూస్తే, కొన్ని డైలాగ్స్‌ అర్థమవుతాయి. ఉదయం లేవగానే మొబైల్‌ చేతులోకి తీసుకునేలోపు బెడ్‌పై స్ట్రెచెస్‌ చేయవచ్చు. మైక్రో హ్యాబిట్స్‌ అనేవి మీ తోటలో విత్తనాలు నాటడంలాంటిది. ఒక మంచి విత్తనాన్ని అలా తోటలోకి విసిరేయండి. అదే పెద్ద చెట్టు అవుతుంది”

”చిన్న చిన్న యాక్షన్స్‌ చేయడానికి మీకు సంకల్ప బలం అక్కర్లేదు. కోచ్‌ అవసరంలేదు. ప్రేరణ అంతకన్నా అక్కర్లేదు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఒకే ఒక స్టెప్‌ వేయండి చాలు. ఈ అలవాటు వల్ల రేపు మీరు సూపర్‌స్టార్‌ అవుతారేమో ఎవరికి తెలుసు. మీకు ఆరోగ్యమే ముఖ్యమైతే ఐదు పుషప్స్‌తో మొదలు పెట్టండి. రెండు నిమిషాలు సారాంశం చదివితే, ఒక పుస్తకం అర్థమవుతుంది. ఏదో ఒక మంచి అలవాటును గుర్తించండి. మీ జీవితంలోకి దాన్ని జొప్పించండి. ఈ మైక్రో హ్యాబిట్స్‌లో (Micro Habits) కొనసాగేలా చూసుకోండి. ఒక పది అలవాట్లు పెట్టుకోండి. తెలియకుండా మీరు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తయారువుతారు. రేపటి నుంచి మైక్రో హ్యాబిట్‌ ఏంటంటే.. వన్‌ పుషప్‌. ఒక వ్యాపకం.. ఒక సిప్‌ ఆఫ్‌ వాటర్‌..” అంటూ పూరి జగన్నాథ్‌ ముగించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.