ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

ఏపీ(Ap)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదారి జిల్లా(East Godavari District) రంగంపేట మండలం వడిసలేరు(Vaisaleru)లో ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది.


ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదాన్ని పరిశీలించారు. ట్యాంకర్‌ను, కారును పక్కకు తీశారు. ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్థానికుల అడిగి తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ”వాహనాలు అతివేగంగా నడుపొద్దు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు. కారులో ప్రయాణికులు, డ్రైవర్ తస్పనిసరిగా సీటు బెల్ట్ ధరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టి ఉంచుకోవాలి” అని వాహనదారులకు సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.