అసెస్మెంట్ ఇయర్ 2025-26 (గత ఆర్థిక సంవత్సరం 2024-25)కి సంబంధించి ఆదాయ వివరాలు నమోదు చేసేందుకు ఐటీఆర్ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాలిడేషన్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది ఆదాయపు పన్ను విభాగం. అయితే, ఇప్పటి వరకు ఐటీఆర్-1, ఐటీఆర్ 4 సంబంధించిన ఎక్సెల్ యుటిలిటీలను మాత్రమే విడుదల చేశారు. ఇందులో తీసుకొచ్చిన 7 మార్పులు ప్రధానంగా వేతన జీవులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కారు లోన్, హోమ్ లోన్, హౌస్ రెంట్ వంటివి ఉండి ఐటీఆర్ 1 ఫైల్ చేసే వారు కచ్చితంగా తెలుసుకోవాలి.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిడక్షన్ల విషయంలో ఫాల్స్ క్లెయిమ్స్ చేయకుండా అడ్డుకునేందుకే ఈ కొత్త మార్పులు తీసుకొచ్చినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఐటీఆర్ డిడక్షన్లను భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియను ఆటోమేటెడ్ చేశారు. ఇందులో తప్పులు దొర్లేందుకు చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. దీంతో నకిలీ క్లెయిమ్స్ చేసే వారు ఇట్టే దొరికిపోతారని ఐటీ శాఖ చెబుతోంది.
హౌస్ రెంట్ అలవెన్సులో మార్పు..
ట్యాక్స్ పేయర్లు హెచ్ఆర్ఏ మినహాయింపు క్లెయిమ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా పలు వివరాలు అందించాలి. అందులో ఎక్కడ పని చేస్తున్నారు, హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది, మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారు, బెసిక్ శాలరీ, డీఏ ఎంత? సహా శాలరీలో 50 శాతం, 40 శాతం ఎంత అవుతుంది? అనే వివరాలు ఇవ్వాలి.సెక్షన్ 80సీ డిడక్షన్..
ఇకపై సెక్షన్ 80సీ ట్యాక్స్ డిడక్షన్ పొందాలంటే పాలసీ నంబర్ లేదా పాలసీ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలి. పీపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఎఫ్‌డీ, లైఫ్ ఇన్సూరెన్స పాలసీల్లో ఇన్వెస్ట్ చేసే వాటికి మినహాయింపు పొందవచ్చు.సెక్షన్ 80డీ మార్పు..
సెభన్ 80డీ కింద వైద్య, ఆరోగ్య ఇన్సూరెన్స్ బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలంటే ట్యాక్స్ పేయర్లు కచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ లేదా డాక్యుమెంట్ నంబర్ ఇవ్వాలి.సెక్షన్ 80ఈ..
సెక్షన్ 80ఈ కింద విద్యా రుణాలపై చెల్లించే వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇకపై ఈ క్లెయిమ్ చేయాలంటే రుణం ఇచ్చిన బ్యాంక్ పేరు, లోన్ అకౌంట్ నంబర్, ఎంత లోన్, మార్చి 31 నాటికి ఇంకా ఎంత లోన్ ఉంది, లోన్ పై వడ్డీ ఎంత? అనే వివరాలు ఇవ్వాలి.సెక్షన్ 80ఈఈ, 80ఈఈఏ
హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు సెక్షన్ 80ఈఈ లేదా 80ఈఈఏ ఉపయోగపడతాయి. అయితే, ఇకపై రుణం ఇచ్చిన బ్యాంక్ పేరు లోన్ అకౌంట్ నంబర్, లోన్ మంజూరు తేదీ, మొత్తం లోన్, మార్చి 31 నాటికి ఉన్న లోన్ మొత్తం ఎంత అనేది తెలియజేయాలి.సెక్షన్ 80ఈఈబీ..
సెభన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ వడ్డీకి మినహాయింపులు క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఇకపై రుణం ఇచ్చిన బ్యాంక్ పేరు, లోన్ అకౌంట్ నంబర్, ఏ తేదీన లోన్ శాంక్షన్ అయింది, మొత్తం లోన్ ఎంత?, మార్చి 31 నాటికి ఇంకా ఎంత ఉంది? అనే వివరాలు అందించాలి.సెక్షన్ 80డీడీబీ..
సెక్షన్ 80డీడీబీ ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఎంపిక చేసిన రోగాలకు అందించి చికిత్సల ఖర్చులకు ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇకపై ఎలాంటి రోగానికి చికిత్స తీసుకుంటున్నారు? ఎక్కడ తీసుకుంటున్నారు అనే వివరాలు అందించాలి.
































