గతేడాదికి సంబంధించి ఉపాధి హామీ పథకం పరిపాలనా వ్యయం బకాయిలు రూ.176.35 కోట్లు, మెటీరియల్ నిధులు గతేడాదికి రూ.790.43 కోట్లు, ఈ ఏడాదికి రూ.169.72 కోట్లు మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన మెటీరియల్, అడ్మిన్ నిధులు రూ.1,136 కోట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి. మెటీరియల్ నిధులు రూ.960.15 కోట్లు, అడ్మిన్ నిధులు రూ.176.35 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతేడాదికి సంబంధించి ఉపాధి హామీ పథకం పరిపాలనా వ్యయం బకాయిలు రూ.176.35 కోట్లు, మెటీరియల్ నిధులు గతేడాదికి రూ.790.43 కోట్లు, ఈ ఏడాదికి రూ.169.72 కోట్లు మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం మెటీరియల్ నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం అంటే రూ.320.15 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర వాటా జమచేస్తే మొత్తం రూ.1,280 కోట్ల మేర మెటీరియల్ నిధులను ఇటీవల సిమెంట్‌రోడ్లు, మినీగోకులాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు చెల్లించే అవకాశముంది. మొదటి విడతలో మొదటి కంతుగా కేంద్రం ఈ వాటా విడుదల చేసింది. ఈ నిధులు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన నిధులు కూడా కేంద్రం విడుదల చేయనుంది.
































