ప్లగ్ చేసినా, అది విద్యుత్తును మండిస్తుంది. పీక్ అవర్స్ సమయంలో మోటార్లు, మిక్సర్లు మరియు గ్రైండర్లను ఉపయోగించవద్దు.

కరెంట్​ఆదా చేస్తే పర్యావరణానికి మేలు చేసినట్టేనని టీజీఎస్పీడీసీఎల్​చైర్మన్, ఎండీ ముషారఫ్​ఫరూఖీ తెలిపారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్​ఆదాపై ప్రజలు దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు. కరెంట్ ను తక్కువ వాడితే బొగ్గు వాడకం తగ్గుతుందని, దీనివల్ల కార్బన్ ఉద్గారాల విడుదల తగ్గుతుందన్నారు. బుగ్గ బల్బుల స్థానంలో ఎల్ఈడీ లైట్లు వాడాలన్నారు. ఇవి 75- నుంచి 80 శాతం తక్కువ విద్యుత్ ను వాడుకుంటాయన్నారు. మొబైల్ చార్జర్లు, టీవీలు, మైక్రోవేవ్​లు, ఐరన్​బాక్స్​లు, వాషింగ్​ మెషీన్లు, కంప్యూటర్లు ఉపయోగంలో లేనప్పుడు అన్ ప్లగ్ చేయాలన్నారు.


ప్లగ్​లు పెట్టి ఆన్​లో ఉంచితే పవర్​సప్లయ్​అవుతుందని, దీన్నే ఫాంటమ్ పవర్​ అంటారన్నారు. ఏసీలను 24- నుంచి 26 టెంపరేచర్​లోనే వాడాలన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఫైవ్​ స్టార్ ​లేదా హై-స్టార్ రేటింగ్ ఉన్న బీఈఈ ఉపకరణాలను వాడాలన్నారు. సంప్రదాయ విద్యుత్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి సోలార్ వాటర్ హీటర్లు లేదా రూఫ్​టాప్​ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేచురల్​లైట్, వెంటిలేషన్​తో లైట్ల, ఫ్యాన్ల అవసరం తగ్గుతుందన్నారు.

మోటర్‌, మిక్సీ, గ్రైండర్లను పీక్‌ అవర్స్‌ (ఉదయం 6 నుంచి 9 వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు)లో వినియోగించొద్దన్నారు. ఈ సమయంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరగక పూర్తి సామర్థ్యంతో పనిచేయవని, దీంతో అదనంగా విద్యుత్‌ అవసరమవుతుందన్నారు. మైక్రో ఓవెన్‌ను మాటిమాటికీ తెరవొద్దని, ఒకసారి ఓపెన్‌ చేస్తే ఓవెన్‌ నుంచి 250 డిగ్రీల వేడి వృథా అవుతుందన్నారు. వార్మ్‌ స్విచ్‌ ఉన్న రైస్‌ కుక్కర్​ వాడితే 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. కరెంట్ ఆదా అంటే కేవలం బిల్లులు తగ్గించడం మాత్రమే కాదని, పర్యావరణానికి మేలు చేయడమని ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.