జియో రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. కేవలం రూ. 51 వేలకే అన్‌లిమిటెడ్ 5G డేటా.. నెల మొత్తం వస్తుంది

 రిలయన్స్ జియో యూజర్లకు పండగే.. అత్యంత సరసమైన ధరకే జియో రీఛార్జ్ ప్లాన్ (Jio Recharge Plan) ప్రవేశపెట్టింది. దేశంలో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్‌ జియో ఈ సరికొత్త ప్లాన్ కేవలం రూ.


51కే అందిస్తోంది.

ఆసక్తిగల వినియోగదారులు రూ. 51తో నెల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండే 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు జియో కస్టమర్ అయితే, ఈ అద్భుతమైన ప్లాన్ అసలు మిస్ చేసుకోవద్దు.

జియో రూ.51 రీఛార్జ్ ప్లాన్ :
జియో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ జియో (Jio Recharge Plan) ప్లాన్ ప్రత్యేకంగా డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. 3GB హై-స్పీడ్ 4G డేటాను కూడా యాక్సస్ చేయొచ్చు.

ఈ డేటా ప్యాక్ వ్యాలిడిటీ నెల వరకు ఉంటుంది. రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ డేటా ప్యాక్‌ను ఇతర యాక్టివ్ ప్లాన్‌లకు సపోర్టు చేస్తుంది.

తద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. జియో రూ. 101, రూ. 151 ప్లాన్‌ కలిగి యూజర్లు కూడా అన్‌లిమిటెడ్ 5G డేటాను ఎంజాయ్ చేయొచ్చు.

రూ. 1748 ప్లాన్, 336 రోజుల వ్యాలిడిటీ :
మొబైల్ డేటా అవసరం లేని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కూడా జియో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు వరుసగా 84 రోజులు, 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కోసం యూజర్లు ఏకంగా రూ.1,748 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్ తీసుకుంటే.. దేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 3,600 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు జియో టీవీ, జియో క్లౌడ్ సర్వీసులకు కూడా ఫ్రీ యాక్సెస్‌ పొందవచ్చు.

జియో యూజర్లు రూ.51 డేటా ప్లాన్‌ను 336 రోజుల ప్లాన్‌కు వర్తించదు. డేటాను యాడ్ చేయాలంటే జియో రూ.19 నుంచి రూ.359 వరకు వివిధ రకాల డేటా వోచర్‌లను పొందవచ్చు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.