ఉపకరణాలు & గాడ్జెట్లు: చెవిలోని గులిమిని తొలగించడానికి ఇది ఒక కొత్త పరికరం.

కొందరు చెవిలో వ్యాక్స్‌(గుబిలి)ని తీయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ.. ఇలాంటి క్లీనర్‌ ఉంటే ఈజీగా వ్యాక్స్‌ని తీసెయ్యొచ్చు. దీనికి 8ఎంపీహెచ్‌డీ కెమెరా ఉంటుంది.


ఇది చెవి లోపలి భాగాన్ని క్రిస్టల్ -క్లియర్‌గా చూపిస్తుంది. దీన్ని ఫోన్‌కి కనెక్ట్‌ చేసి స్క్రీన్‌ మీద కెమెరా వ్యూ చూడొచ్చు. దానివల్ల వ్యాక్స్ తీయడం ఈజీ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ గైరోస్కోప్ ఉండడం వల్ల ఫోన్‌ స్క్రీన్‌ని తిప్పకుండానే అన్ని వైపుల్లోని విజువల్స్‌ను చూడొచ్చు.

ఈ క్లీనర్‌కి స్టెయిన్‌లెస్ స్టీల్ టిప్ ఉంటుంది. దానికి పెట్టుకోవడానికి ఐదు మృదువైన సిలికాన్ స్కూప్‌లు వస్తాయి. అంతేకాదు.. చెవి లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి వెలుతురుని ఇవ్వడానికి 6 ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. దీనికి యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌తో చార్జింగ్ పెట్టుకుని, వైర్‌ కనెక్షన్‌ లేకుండానే వాడుకోవచ్చు. ఈ క్లీనర్‌తోపాటు చెవిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కిట్‌ కూడా వస్తుంది.

ధర : రూ. 949

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.