అనుకోని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది.
ఇలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదనే చాలామంది ఇన్సురెన్స్ తీసుకుంటారు. కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో.. ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తారు. అలాంటివారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ ఓ అద్భుతమైన పాలసీని అందిస్తోంది.
వెయ్యి కడితే 20 లక్షలు
SBI బ్యాంక్‌లో ఏడాదికి వెయ్యి రూపాయిలు కడితే 20 లక్షల కవరేజ్ ఇస్తుంది. అవును సంవత్సరానికి కేవలం వెయ్యి కడితే చాలు. ఫ్యామిలీకి 20 లక్షల కవరేజ్ అందుతుంది. అయితే ఈ పాలసీ పేరు ఏంటి? ఏమైనా అర్హతలు ఉండాలా? పాలసీ ఇస్తోన్న బెనిఫిట్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ పేరు ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోన్న ఈ పాలసీ పేరు SBI Generals Group Health Insurence Policy. ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంక్‌లో అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
అర్హతలు ఇవే
18 నుంచి 65 ఏళ్లు ఉండే ప్రతి ఒక్కరు ఈ పాలసీ కోసం అప్లై చేయవచ్చు. అయితే దీనిని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కచ్చితంగా ఉండాలి. పాలసీ కోసం 1,000 కట్టాలి. సంవత్సరం మొత్తానికి ఇదే సరిపోతుంది. ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు 20 లక్షల కవరేజ్ లభిస్తుంది.
మరిన్ని ప్రయోజనాలు
పిల్లల చదువుకోసం కూడా బ్యాంక్ పే చేస్తుంది. అంతేకాకుండా కవరేజ్‌లో వచ్చిన 20 లక్షలను బ్యాంక్ వాళ్లే వచ్చి ఫ్యామిలీకి ఇస్తారు.
మరిన్ని పాలసీలు..
నిజానికి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో 100 నుంచి ఉన్నాయి. ఏడాదికి 100 లేదా 200 లేదా 500 లేదా 1000 ఎస్బీఐలో కట్టవచ్చు. 100 కడితే 2 లక్షలు..200 కడితే 4 లక్షలు, 500 కడితే 10 లక్షలు, 1000 కడితే 20 లక్షల కవరేజ్ వస్తుంది. అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కిందనే వస్తుంది. అంటే ప్రమాదవశాత్తు చనిపోతేనే ఈ పాలసీ వర్తిస్తుంది. లేకుంటే అవ్వదు.
ఏదైనా ప్రమాదం జరిగి.. మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనుకుంటే ఎస్బీఐలో ఈ పాలసీని తీసుకోవచ్చు. బ్యాంక్ ప్రతినిధులను పూర్తి వివరాలు అడిగి.. మీకుండే పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి.. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ పాలసీని తీసుకుంటే కుటుంబానికి బెనిఫిట్ అందుతుంది.
































