ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ 2025 మోడల్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ శ్రేణి మోటార్ సైకిళ్లను ఆవిష్కరించింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలతో ఈ మోటార్ సైకిల్‌ను తీర్చిదిద్దింది. దీంతోపాటు అత్యాధునిక టెక్నాలజీ, అద్భుత పనితీరు, మెరుగుపరిచిన భద్రతా ఫీచర్లతో ఈ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ధర రూ.1,53,990(ఎక్స్‌షోరూమ్, దిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఇవి లభిస్తాయని తెలిపింది.
ఈ మోటార్ సైకిల్‌ను ఓబీడీ2బీ నిబంధనలతో పాటు 37 ఎంఎం అప్‌సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, మెరుగైన హ్యాండ్లింగ్ కోసం హైడ్రో ఫార్మ్‌డ్ హ్యాండిల్‌బార్‌తో తీసుకొచ్చారు. రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లతో టీవీఎస్ తీసుకొచ్చింది. ఓబీడీ2బీ నిబంధనల ప్రకారం ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ సిస్టమ్ ఈ మోటార్ సైకిల్‌లో ఉంది. ఈ మోటార్ సైకిల్ 20.8 పీఎస్ పవర్‌ను 17.25 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, మూడు రైడ్ మోడ్స్ (అర్బన్, స్పోర్ట్, రెయిన్), స్లీపర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ క్లస్టర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఇచ్చారు. గ్లాసీ బ్లాక్, మ్యాటీ బ్లాక్, గ్రానైట్ రంగుల్లో ఈ మోటార్ సైకిళ్లు లభిస్తాయి.




































