గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాఖాహార ఆహారాలు ఇవే

పెసరపప్పు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది మంచి రుచిని ఇవ్వడంతో పాటు దీనిని తినడం వలన జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. అలాగే ఇందులో ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుందంట.


100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. శాఖాహారులకు మంచి ప్రోటీన్ కావాలంటే తప్పకుండా దీనిని మీ ఆహారంలో చేర్చుకోవాలంట.

అలాగే ఉడికించిన శనగలు శరీరానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాములకు దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే ప్రోటీన్ కావాలి అనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.

కోడి గుడ్డులోకంటే పన్నీరు లో కూడా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుందంట. 100 గ్రాముల పన్నీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువలన పన్నీర్ తినడం వలన ఎముకలు బలంగా ఉండటమే కాకుండా , జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుందంట. పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది.

కాల్చిన శనగలు స్నాక్స్ లా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే వీటిని ఇలా తినడం వలన ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తినిస్తాయంట. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. 100 గ్రాముల కాల్చిన శనగల్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన వీటిని ఇలా స్నాక్స్ లా తీసుకోవడం లేదా సత్తు చేసుకొని తిడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందంట.

రాజ్మా చావల్ తినడం శరీరానికి చాలా మంచిది. డ్రై రాజ్మా 100 గ్రాముల్లో 24 గ్రాముల ప్రోటీన్ కలగి ఉంటుందంట. అంతే కాకుండా దీనిలో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.