అమరావతి మహిళల(Amaravati Women Issue)పై సాక్షి టీవి డిబేట్ లో జరిగిన చర్చ తీవ్ర ఆందోళన దిశగా పయనిస్తోంది. ఈ వ్యవహారంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ నిన్నటి నుంచి ఏపీలో జరుగుతున్న నిరసనలు, ధర్నాలు ఆగడం లేదు. నేడు ఏలూరు(Eluru)లో నిరసన ర్యాలీ జరుగుతున్న క్రమంలో సాక్షి ఆఫీసుకు దుండగులు నిప్పు పెట్టారు(Fire at Sakshi’s office). దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోయాయి. పార్కింగ్ లో నిలిపి ఉంచిన కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు.
ఇది టీడీపీ నేతలు కక్ష్యపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. కాగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ శాంతియుత ర్యాలీపై నిందలు మోపుతున్నారని టీడీపీ వివరణ ఇచ్చింది. మరోవైపు నిరసనలు చేస్తున్న మహిళలను సంకర తెగ, పిశాచాలు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి దూషించడం కూడా ఈ గొడవ ముదరడానికి మరో కారణం అయింది.
































