శుభ కార్యక్రమాల నుండి విరామం! మౌఢ్యమి సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

ఓ వైపు గురు మౌఢ్యమి..ఆ తర్వాత ఆషాఢ మాసం ప్రారంభం. నెలన్నర పాటూ శుభకార్యాలకు ఫుల్ స్టాప్ పడినట్టే. మళ్లీ శ్రావణమాసం మొదలైన తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయి.


అసలు మౌఢ్యమి అంటే ఏంటి? ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది

గురు మౌఢ్యమి ప్రారంభం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి జూన్ 10 మంగళవారం ఉదయం 10 గంటల 47 నిముషాల నుంచి జూన్ 11 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 21 నిముషాల వరకు.

జూన్ 11 బుధవారం జ్యేష్ఠ పౌర్ణమి…ఈ రోజు నుంచి గురు మౌఢ్యమి ప్రారంభమవుతుంది

జూలై 12 ఆషాఢమాస బహుళ విదియ శనివారంతో గురు మౌఢ్యమి ముగుస్తుంది

మౌఢ్యమి రోజుల్లో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదు?

నవగ్రహాలకు రాజు సూర్యభగవానుడు. ఆదిత్యుడికి సమీపంలోకి ఏ గ్రహం వచ్చిన తన శక్తిని కోల్పోతుంది. అలా గురుగ్రహం ఆదిత్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహం దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ సమయంలో గురుడు, శుక్రుడి శక్తి క్షీణిస్తుంది.

ఏ శుభకార్యం నిర్వహించాలన్నా గురుబలం, శుక్రగ్రహం చాలా ప్రధానం. ఈ రెండు గ్రహాలు శక్తిని కోల్పోయినప్పుడు శుభకార్యాలు నిర్వహిస్తే గురు బలం ఉండవు. గురుబలం లేకుండా నిర్వహించిన ఏ శుభకార్యమూ శుభాన్నివ్వదు. అందుకే ఈ సమయంలో ఏం చేసినా కలసి రాదని పండితులు చెబుతారు. మూఢంలో శుభకార్యాలు చేయకూడదని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఇదే.

అయితే అన్ని కార్యాలు ఆపేయాల్సిన అవసరం లేదు.. కొన్ని తప్పనిసరిగా ఆపేయాలి, కొన్ని నిర్వహించుకోవచ్చు..అవేంటంటే

శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మౌఢ్యమి రోజుల్లో వివాహం చేయకూడదు. లగ్న పత్రిక కూడా రాసుకోకూడదు, అసలు పెళ్లికి సంబంధించిన మాటలు కూడా కూడదు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.