పశ్చిమాసియా(West Asia) దేశాలు అయిన ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం(Israel – Iran War) జరుగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది.
రెండు రోజుల వ్యవధిలో ఇరాన్‌లో 80 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పుడుతోంది. టెల్ అలీవ్, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది మృతి చెందారు. అయితే ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్న యుద్ధంలోకి ఇరాన్ సమీప దేశం అయిన యెమెన్ రంగంలోకి దిగింది.
ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. ఈ మేరకు యెమెన్ మిలిటరీ (Yemeni military) ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. తాము గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ పై రెండు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినట్లు యెమెన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. తాజా పరిస్థితులతో యుద్ధ పరిస్థితి విపరీతంగా మారిపోయింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ సమన్వయంతో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడులు చేస్తున్నారు. ఉదాహరణకు, జూన్ 15, 2025న ఇజ్రాయెల్‌లోని జఫ్ఫా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడులు గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా, ఇరాన్ యొక్క సైనిక మద్దతుతో జరిగాయని హౌతీ నాయకత్వం ప్రకటించింది.

































