తిరుపతి వెళ్లాల్సిన విమానంలో పొగలు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ వాతావరణం

ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులపై గమ్య స్థానాలను చేరుకోవాలంటే విమాన ప్రయాణమే. కానీ ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి.


రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస ప్రమాదాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలి ఏడుగురు మరణించారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానంలో నుంచి పొగలురావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ 2138 నెంబర్ విమానంలో కాలిన వాసన రావడంతో విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

టేకాఫ్ ముందే విమానాన్ని ఎయిర్ పోర్టులో నిలిపివేశారు. క్షణాల్లో గాల్లో ఎగరాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ పోర్టులో నిలిపివేవయడంతో ప్రయాణికులు సుమారు మూడున్నర గంటలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు టేకాఫ్ అయిన తర్వాత ఈ సాంకేతిక లోపం మరింత పెద్దగా మారితే ప్రాణాలు గాల్లోనే కలిపిపోయేవంటూ ఊపిరిపీల్చుకున్నారు.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ లో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలో ఏదో కాలిపోయిన వాసన రావడంతోపాటు పొగలు వ్యాపించడంతో విమానాన్ని టేకాఫ్ ముందు నిలిపివేశారు. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను ఎంతగానో టెన్షన్ పెట్టించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7.30గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం కారణంగా మూడున్నర గంటల పాటు ఎయిర్ పోర్టులోనే ఫ్లైట్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.