సెంట్రల్ బ్యాంక్ లో 4,500 ఉద్యోగాలు.. అర్హతలు ఏమిటి?

బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ (Bank Jobs) కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 4,500 అప్రెంటిస్ (Central Bank of India Apprentice 2025) ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించుకుని, వెంటనే అప్లై చేయండి మరి. ఈ అప్రెంటిస్ పోస్టులతో యువతకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మెరుగైన అవకాశాలు వచ్చే ఛాన్సుంది.

  • పోస్ట్ పేరు: అప్రెంటిస్
  • మొత్తం ఖాళీలు: 4500
  • నోటిఫికేషన్ విడుదల తేది: 07-06-2025
  • చివరి తేదీ: 23-06-2025
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జూలై తొలి వారం

అర్హత ప్రమాణాలు

  • అభ్యర్థులు భారత ప్రభుత్వానికి అనుసంధానమైన ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • వయో పరిమితి (01-04-2025 నాటికి): కనిష్ఠ వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 28 సంవత్సరాలు
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఇస్తారు.

దరఖాస్తు రుసుం

  • PWD అభ్యర్థులకు రూ. 400 + GST
  • SC/ST, మహిళలు, EWS అభ్యర్థులకు రూ. 600 + GST
  • ఇతర అభ్యర్థులకు రూ. 800 + GST
  • ఫీజు చెల్లింపు తేది: 07-06-2025 నుంచి 25-06-2025 వరకు

వేతనం (స్టైఫెండ్)

  • అప్రెంటిస్‌గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలకు రూ.15,000 స్టైఫండ్ లభిస్తుంది
  • ఇతర భత్యాలు లేదా ప్రయోజనాలు ఉండవు

ఎంపిక ప్రక్రియ

  • ఆన్‌లైన్ పరీక్ష: అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
  • ఫైనల్ ఎంపిక: డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్న అభ్యర్థులను ఒక సంవత్సర కాలం పాటు అప్రెంటిస్‌గా తీసుకుంటారు.

ఎలా అప్లై చేయాలి

  • అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inను ముందుగా సందర్శించండి
  • ఆ తర్వాత Apprentices Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయండి
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  • సంబంధిత ఫీజు చెల్లించి, దరఖాస్తు పూర్తి చేయండి
  • చివరకు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి
  • ఒక్కసారి అప్లై చేసిన దరఖాస్తును సవరించలేరు. కాబట్టి అప్లై చేసే ముందు పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేయండి
  • అభ్యర్థి ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ పనిచేస్తూ ఉండాలి. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అన్ని అప్‌డేట్లు వాటికి వస్తుంటాయి
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.