హిందూ మతంలో సోదర-సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
ఈ పండుగ అన్నదమ్ముల.. అక్కచెల్లెలను ప్రేమ బంధంలో బంధిస్తుంది. ఈ రోజున సోదరీమణులందరూ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు. తమ సోదరుల నుంచి దీవెనలను తీసుకుంటారు. 2025 సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం..
వేద క్యాలెండర్ ప్రకారం 2025 సంవత్సరంలో రక్షా బంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తిధి శనివారం, 9 ఆగస్టు 2025న వచ్చింది. ఈ రోజున సోదరీమణులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకి రాఖీని కడతారు.
రాఖీ పండగ 2025 తిథి
శ్రావణ మాసం పౌర్ణమి తిధి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 2:12 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ పౌర్ణమి తిధి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది.
ఉదయతిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9, శనివారం జరుపుకుంటారు.
రాఖీ కట్టే సమయం ఉదయం 05:56 నుంచి మధ్యాహ్నం 01:24 వరకు ఉంటుంది.
ప్రదోష కాలంలో రాఖీ కట్టే సమయం
రాఖీ పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ రోజు ప్రదోష కాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9:24 వరకు.
రాఖీ పౌర్ణమి రోజున భద్ర కాలం ఎప్పుడు?
రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్ర కాలం శుభప్రదంగా పరిగణించబడదు. భద్ర కాలం 2025 ఆగస్టు 9న తెల్లవారుజామున 1:52 గంటలకు ముగుస్తుంది. అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు. కనుక ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 వరకూ రాఖీని కట్టవచ్చు.
ఎందుకంటే భద్ర కాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి. భద్ర కాలం ఉంటే.. ప్రదోష కాలంలో కూడా రాఖీ కట్టవచ్చు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
































