ఐరన్ మన బాడీకి చాలా ముఖ్యం. ఐరన్ లేకపోవడం వల్ల చాలా సమస్యలొస్తాయి. అందుకే, ఐరన్ లెవల్స్ ఎప్పటికప్పుడు సరిగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఫుడ్ ద్వారానే ఐరన్ లెవల్స్ చెక్ చేసుకునేందుకు ఏ ఫుడ్స్ తీసుకోవాలంటే
ఫుడ్ సరిగ్గా తిన్నా బాడీలో ఐరన్ లోపం తగ్గట్లేదా, కేవలం 3 ఫుడ్స్ తీసుకుంటే చాలు, రక్తం అమాంతం పెరుగుతుంది
ఏ పనిచేయకుండానే అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం వంటివన్నీ ఐరన్ లోపం లక్షణాలే. ప్రపంచంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలోని ఎర్ర రక్తకణాల్లో ఖనిజాల లోపం కారణంగా ఈ సమస్య వస్తుంది. దీంతో కణాలకు ఆక్సీజన్ తక్కువగా అందుతుంది.
ఐరన్ లోపం సమస్య ఉంటే తలనొప్పి, మైకం, తలతిరగడం, నాలుక నొప్పి, జుట్టు ఎక్కువగా రావడం, పేపర్, ఐస్ వంటివి తినాలనిపించడం వంటివి కూడా జరుగుతాయి. ఈ ఐరన్ లోపాన్ని నేచురల్‌గానే తగ్గించాలనుకుంటే కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. అవేంటంటే..
ఐరన్ లోపానికి కారణాలు
బాడీలో ఐరన్ లోపం ఏర్పడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆకుకూరలు, మాంసం, ఐరన్ ఉండే ఫుడ్స్‌ని తక్కువగా తీసుకోవడం.
ఆడవారికి పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్ కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది.
పుండ్లు, అర్షమొలలు వంటిసమస్యల కారణంగా ఐరన్ తగ్గుతుంది.
కొంతమందికి సరైన ఫుడ్ తీసుకున్నప్పటికీ బాడీ సరిగా అబ్జార్బ్ చేసుకోకపోతే ఈ సమస్య వస్తుంది. దీనికి ప్రేగు సంబంధిత సమస్యలు కారణమవ్వొచ్చు.
దీంతోపాటు డెలివరీ తర్వాత బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఐరన్ లోపం తలెత్తుతుంది.
ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు కూడా కండరాలకు ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటుంది. దీంతో ఐరన్ లోపం వస్తుంది.
వేయించిన శనగలు, బెల్లం
వేయించిన శనగలు చాలా మంచివి. వీటితో పాటు బెల్లం ఇవి బెస్ట్ స్నాక్ ఐటైమ్. ఈ రెండింటి కాంబినేషన్ బాడీలో మ్యాజిక్‌ని చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఖనిజాలు, సెలీనియం, ఫైబర్, విటమిన్ బి6లు ఉన్నాయి.
ఆయుర్వేదం ప్రకారం, ఐరన్ లోపాన్నే కాకుండా లివర్ ప్రాబ్లమ్స్, చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది శోథ నిరోధక ప్రభావాలని కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు వేయించిన శనగలు, బెల్లాన్ని కలిపి తినండి.
నువ్వులు
నువ్వుల్ని మన వంటల్లో ఎక్కువగా వాడతాం. దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సాధారణంగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉంటాయి. వీటిని మనం లడ్డూల్లా చేసి తినడం, నువ్వుల కారంలా చేసి తినొచ్చు. వీటిని పొడిలా చేసి వంటల్లో వేసుకుని తినొచ్చు. రోజుకో టీస్పూన్ చొప్పున తినండి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకి కారణమైన అనీమియాకి చెక్ పెట్టొచ్చు.
ఐరన్ లోపాన్ని తగ్గించే ఫుడ్స్
ఉసిరి, తేనె, నల్ల మిరియాల పొడి
ఈ రెండింటి కాంబినేషన్‌లో కూడా ఐరన్, విటమిన్స్, ఇమ్యూనిటీని పెంచేవే. జీర్ణక్రియ, గ్రాహి పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే, ఇందులో తేనె ఉంటుంది.
రోజుకి ఓ సారి తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకోవడం మంచిది. దీని వల్ల మీరు వృద్ధాప్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు.
వీటితో పాటు
మంచి పోషకాహారం తీసుకోవాలి. రెడ్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, బీన్స్, ఆకుకూరలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, గుడ్లు, నట్స్, సీడ్స్ తీసుకోవాలి.
విటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటే బాడీ ఐరన్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. టీ, కాఫీలను తగ్గించాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి. కాల్షియం ఫుడ్ ఐరన్ శోషణని అడ్డుకుంటుంది.
































