సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..

నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుండి 30 సెకన్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్ లోకి అందుబాటులోకి తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్ర లో ప్రవేశపెడుతున్నాని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నిలోఫర్‌ ఆసుపత్రిలో పిల్లలకు, గర్భిణులకు ఇలాంటి టెస్టుల ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిలోఫర్ వైద్యులు తెలిపారు. అమృత్ స్వస్త్ భారత్‌లో ఇకపై ఆరోగ్య పర్యవేక్షణ సెల్ఫీ తీసుకున్నంత సులభం కాబోతుంది. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగవంతమైన రీతిలో అందిస్తుంది. దీనితో రక్తపోటు, హార్ట్ రేట్, హీమోగ్లోబిన్ ఏ1సి వంటివి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలు 20 -60 సెకన్ల లోనే పూర్తవుతాయి. త్వరలోనే ఈ సేవలను దేశం వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నామని నిర్వాహకులు తెలిపారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.