ఆ బీసీ కులం పేరు మార్పు.. కూటమి ప్రభుత్వం సంచలనం

 ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బీసీ జాబితాలో ఓ కులం పేరు మార్చింది. ఓ పదాన్ని తొలగించింది. రాష్ట్రంలో బీసీ ఏ లోని దాసరి సామాజిక వర్గానికి సంబంధించి మార్పులు చేసింది. దాసరి సామాజిక వర్గానికి చెందిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో..

ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బీసీ జాబితాలో ఓ కులం పేరు మార్చింది. ఓ పదాన్ని తొలగించింది. రాష్ట్రంలో బీసీ ఏ లోని దాసరి సామాజిక వర్గానికి సంబంధించి మార్పులు చేసింది. దాసరి సామాజిక వర్గానికి చెందిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో.. దాసరి పక్కనే బ్రాకెట్లో ‘భిక్షాటన చేసేవారు’ అని రాసేవారు. అయితే అది తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆ సామాజిక వర్గ ప్రజలు ఇన్ని రోజులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ పదాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాలు అందించారు.


ఆ పదం తొలగింపు
అయితే ఇటీవల కూటమి ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధ్రువీకరణ( caste identity) పత్రాలు జారీ చేసే సమయంలో రాసే ఆ పదాలను తొలగిస్తూ సవరణ చేసింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ‘దాసరి’ అని మాత్రమే పేర్కొనేలా కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దాసరి సామాజిక వర్గం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలను ఆహ్వానిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. మూడు దశాబ్దాల తర్వాత అన్ని అడ్డంకులు దాటుకుని అమల్లోకి వచ్చింది ఎస్సీ వర్గీకరణ. కొత్త నియామకాలు, ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ పై అధ్యయనం చేసేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దాదాపు 5 నెలల అధ్యయనం తర్వాత ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను అనుసరించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. మూడు విభాగాలుగా విభజించింది. గ్రూప్ వన్ కింద రెల్లి దాని ఉపకులాలు 12, గ్రూప్ 2 కింద మాదిగ దాని ఉప కులాలు 18, గ్రూప్ 3 కింద మాల దాని ఉప కులాలు 29 ఉండే విధంగా ఈ విస్తరణ పూర్తి చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాలుగా వినిపిస్తూ వస్తున్న మాట. కానీ దానిని సాకారం చేసింది కూటమి ప్రభుత్వం. ఆయా సామాజిక వర్గాల్లో వస్తున్న వినతులపై కూడా దృష్టి సారించి పరిష్కరిస్తుంది. అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గంలోని దాసరి కులం విషయంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.