అవయవాలు ఎప్పుడు చెడిపోతాయో మీకు తెలుసా?

 చాలామంది కనిపించిదల్లా తినేస్తుంటారు. ఇష్టమొచ్చిన సమయంలో పడుకుంటారు. అవి చెడు అలవాట్లు అని తెలిసినా మందు, సిగరెట్ల వెనకాల పరుగులు పెడతారు.


దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని తగ్గించడానికి హాస్పిటల్స్ ఉన్నాయి కదా. వేల వేల రూపాయలు ఖర్చుపెడతారు. మందులు వేసుకుని ఆ జబ్బును నయం చేసుకుంటారు. ఇంత వరకు బానే ఉంది. కానీ మీరు ఇలా మీకు ఇష్టమొచ్చినట్లు చేసుకుటూ వెళ్లిపోతే మీ శరీరంలోని కొన్ని అవయవాలు ఫెయిల్ అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవే హార్ట్ ఎటాక్స్, ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అవయవాలు ఎప్పుడు ఎలా చెడిపోతాయో ముందే తెలుసుకుని జాగ్రత్తపడటం చాలా ముఖ్యం.

కళ్లు : మొబైల్ ఎక్కువగా చూడడం , ఎక్కువగా నిద్రలేకపోవడం, సైట్ ఉన్నా కళ్లజోళ్లు వాడకుండా ఉండటం వల్ల కళ్లు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చీకట్లో మొబైల్‌ని చూస్తే సైట్ తొందరగా రావడమే కాదు వయసు పెరిగే కొద్దీ కళ్ల సమస్యలను ఎన్నో ఎదుర్కోవలసి వస్తుంది.

మెదడు : తగినంత నిద్రలేకపోవడం, ఒత్తిడి, స్ర్కీనిని ఎక్కువగా చూడడం వల్ల మెదడు అలసిపోతుంది. ఇలా రెస్ట్ లేకపోవడం వల్ల మెదడు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇవ్వాల్సిన సమయంలో మెదడుకు రెస్ట్ ఇవ్వాలి.

చెవులు : హెడ్ ఫోన్లు ఎక్కువ శబ్దంతో వినడం, పెద్ద పెద్ద శబ్బాలకు దగ్గరగా ఉండటం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

గుండె : ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు రావడం ఖాయం. ముఖ్యంగా చిన్నవయసులో హార్ట్ ఎటాక్స్ రావడం జరుగుతుంది.

ఊపిరితిత్తులు : పొగత్రాగడం , కాలుష్యంలో తిరగడం వల్ల ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. శరీరానికి బాడీ స్ప్రేలు ఎక్కువగా వాడుతున్నా, ఇళ్లలో అగరబత్తీలు ఎక్కువగా వాడుతున్నా కూడా ఊపిరితిత్తులు పాడైపోతాయి. కాబట్టి వీటన్నింటికీ దూరంగా ఉండాలి.

కాలేయం: బయట ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం పాడవుతుంది. కాబట్టి వీటిని దగ్గరకు రానివ్వకూడదు.

కిడ్నీలు : చాలామంది నీళ్లు ఎక్కువగా తాగరు. పైగా ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా కిడ్నీలు పాడైపోతాయి. అందుకే రోజు 2 లీటర్లకు పైనే నీళ్లు తాగాలి.

ఎముకలు : కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, కాల్షియం ఆహార పదార్ధాలు తీసుకోకపోవడం, కూర్చునేటప్పుడు , నిలుచునేటప్పుడు సరైన పద్దతితో ఉండకపోవడం వంటివి ఎముకలను వీక్ చేస్తాయి.

పేగులు : ఎక్కువ కారం , మసాలాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల పేగులు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తగ్గించాలి.

జీర్నాశయం : ఎక్కువగా కారం ఉన్న ఆహారం తినడం, పాలు సరిగా తాగకపోవడం, గ్యాస్ట్రిక్‌ని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి జీర్నాశయాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటికి దూరంగ ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.