175 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకం.. ఉత్తర్వులు జారీ

 రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.


రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ప్రభుత్వ P4 కార్యక్రమాల సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ తరుణంలో తాజాగా కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు నిపుణులను నియమించాలని నిర్ణయించింది. ఈ రోజు(మంగళవారం) నియోజకర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.