టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి (Mahesh Kumar Goud) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ (మంగళవారం) లీగల్ నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మహేష్ గౌడ్ చేసినవి అసత్య ఆరోపణలేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ తన చేతగానీతనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే భేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
































