ఐటీఆర్ ఫైల్ చెయ్యాల్సింది వీరు మాత్రమే.

న్ను చెల్లింపుదారులలో టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్) కట్ అయిందంటే పన్ను బాధ్యత పూర్తయ్యిందని అనుకునే వారు చాలామంది. కానీ నిపుణులు చెబుతున్న విషయం మాత్రం భిన్నంగా ఉంది.


మీరు ఎంత టీడీఎస్ కట్ అయినా సరే, కొన్ని పరిస్థితుల్లో ఐటీఆర్ (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయకపోతే ముమ్మాటికీ సమస్యలు ఎదురవుతాయి.

టీడీఎస్ అంటే ముందే మీ ఆదాయం నుండి పన్నును మినహాయించడం. ఉదాహరణకు జీతం, ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీలు, అద్దె వంటి లావాదేవీలలో ఈ విధానం ఉంటుంది. కానీ టీడీఎస్ కట్ అయినంత మాత్రాన అది మీకు చెల్లించాల్సిన మొత్తం పన్నును ప్రతిబింబించదు. ప్రభుత్వం అది ఒక అంచనాపై మినహాయిస్తుంది. అసలైన లెక్కలు మాత్రం మీరు ఐటీఆర్ ద్వారా వెల్లడించాలి.

ఐటీఆర్ ఫైలింగ్ అనేది కొన్ని సందర్భాల్లో తప్పనిసరి. మీరు విదేశీ ఆదాయాన్ని పొందినప్పుడు, 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణాలు చేసినప్పుడు, లేదా ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ బ్యాంక్ డిపాజిట్లు చేసినప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాలి. అలాగే, ఒక వ్యక్తి ఆదాయం రూ.2.5 లక్షలకు మించినట్లయితే తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే.

ఇంకా మీ టీడీఎస్ ఎక్కువగా కట్ అయి ఉండి, దానిని తిరిగి రీఫండ్‌గా పొందాలనుకుంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అలాగే, మీరు క్యాపిటల్ గెయిన్స్ నష్టాలను ఫ్యూచర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే కూడా ఐటీఆర్ అవసరమవుతుంది. ఇది మీకు అప్పటి ప్రయోజనం కాకపోయినా, భవిష్యత్తులో ట్యాక్స్ ప్లానింగ్‌లో ఎంతో ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా, ఐటీఆర్ ఫైలింగ్‌ వల్ల వ్యక్తిగత ఆర్థిక ప్రతిష్ట పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్‌లు, లోన్లు లేదా వీసా అప్లికేషన్లలో ఐటీఆర్ కీలకంగా మారుతుంది. కాబట్టి టీడీఎస్ కట్ అయిందని ఐటీఆర్ ఫైలింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు. జూలై 31 చివరి తేదీగా ఉండగా, ఈసారి సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన అవకాశం ఉండటంతో ఇప్పుడే మీ రిటర్న్ దాఖలుకు సిద్ధమవ్వాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.