వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తినడం, ఎండ వేడి నుండి రక్షించుకోవడానికి తగిన దుస్తులను ధరించడం వంటివి చేస్తుంటాం. అదేవిధంగా వర్షాకాలంలోనూ అందుకు తగిన మార్పులు చేస్తుంటాం. ముఖ్యంగా ఈ కాలంలో కొన్ని బట్టలు తడిస్తే, ఆరడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల చికాకు..
రుతువులు.. కాలాలు మారేకొద్దీ జీవనశైలిలోనూ సాధారణంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తినడం, ఎండ వేడి నుండి రక్షించుకోవడానికి తగిన దుస్తులను ధరించడం వంటివి చేస్తుంటాం. అదేవిధంగా వర్షాకాలంలోనూ అందుకు తగిన మార్పులు చేస్తుంటాం. ముఖ్యంగా ఈ కాలంలో కొన్ని బట్టలు తడిస్తే, ఆరడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల చికాకు వస్తుంది. అందుకే ఈ సీజన్‌కు తగిన సౌకర్యవంతమైన ఫాబ్రిక్ దుస్తులను ధరించాలి. వర్షాకాలానికి ఏ బట్టలు ధరిస్తే సౌకర్య వంతంగా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
రేయాన్
భారీ వర్షాల సమయంలో రేయాన్ ఫాబ్రిక్ దుస్తులను ధరించడం మంచిది. సెమీ సింథటిక్ ఫాబ్రిక్ కావడంతో ఇది చాలా తేలికగా ఉంటుంది. తడిస్తే త్వరగా ఆరిపోతుంది. అలాగే ఈ బట్టలు చర్మానికి అంటుకోవు. కాబట్టి, చర్మానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మస్లిన్
మస్లిన్ అనేది కాటన్ కంటే మృదువైన, వదులుగా ఉండే నేత వస్త్రం. ఇది తేలికైన, మృదువైన ఆకృతికి ప్రసిద్ధి చెందింది. మస్లిన్ బట్టలు గాలిని పీల్చుకునేలా ఉంటాయి. వర్షాకాలంలో తేమ నుండి రక్షిస్తాయి. అలాగే త్వరగా ఆరిపోతాయి కూడా. కాబట్టి ఇవి వర్షాకాలానికి సరైనవి.
క్రేప్ ఫాబ్రిక్
వర్షాకాలంలో ధరించడానికి కూడా క్రేప్ ఫాబ్రిక్ అనుకూలంగా ఉంటుంది. రేయాన్ లాగా, ఇది కూడా చాలా తేలికగా ఉంటుంది. చాలా త్వరగా ఆరిపోతుంది. అలాగే ఈ ఫాబ్రిక్ ధరించడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
పాలిస్టర్
పాలిస్టర్ అనేది తేమను నిలుపుకోని సింథటిక్ ఫాబ్రిక్. ఇది కూడా వర్షాకాలంలో ధరించడానికి అనువైనది. తడిస్తే చాలా త్వరగా ఆరిపోతాయి.
లినెన్
లినెన్ ఫాబ్రిక్ దుస్తులు వర్షాకాలంలో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ వస్త్రం చాలా తేలికగా ఉంటుంది. తడిస్తే చాలా త్వరగా ఆరిపోతుంది. అలాగే ఈ వస్త్రం శరీరంపై చెమట పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అందువల్ల వర్షాకాలంలో ధరించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
నైలాన్
నైలాన్ ఫాబ్రిక్ దుస్తులను వర్షాకాలంలో కూడా ధరించవచ్చు. ఈ బట్టలు తేలికైనవి మాత్రమే కాదు, తడిస్తే చాలా త్వరగా ఆరిపోతాయి. కాబట్టి ఈ ఫాబ్రిక్ వర్షాకాలంలో ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఫాబ్రిక్ పాలిస్టర్ కంటే ఎక్కువ మన్నికైనది. చాలా మృదువైనది.
కాటన్ దుస్తులు
వర్షాకాలంలో ధరించడానికి కాటన్ దుస్తులు కూడా అనుకూలమైనవి. ఈ ఫాబ్రిక్ తేలికైనది. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఫాబ్రిక్ తేమను బాగా గ్రహిస్తుంది కాబట్టి, తడిస్తే చాలా త్వరగా ఆరిపోతుంది. కాబట్టి, ఈ వర్షాకాలంలో కాటన్ ఫాబ్రిక్ దుస్తులను ధరించడం మంచిది.
































