విద్యార్థులకు శుభవార్త.. 3 రోజుల పాఠశాలలకు సెలవులు

పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్నంలో స్వయంగా పాల్గొని ఆసనాలు వేయనున్నారు. యోగా ఏర్పాట్లలో భాగంగా విశాఖలోని అన్ని పాఠశాలలకు 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా సెలవులను రానున్నాయి. అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగాదినోత్సవ ఏర్పాట్లలో భాగంగా కొన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి.

ఇక ఈ నెల 20, 21వ తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు డీఈవో పేర్కొన్నారు. అటు ఆదివారం ఎలాగో సెలవు రోజు. ఇలా విద్యార్ధులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇక శుక్రవారం,శని వారం రోజుల్లో ప్రతి స్కూల్లో విద్యార్థులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు.

విశాఖలో భారీ ఏర్పాట్లు:

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యోగాడేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కార్‌.. బీచ్ రోడ్డులోని ప్రధాన వేదిక నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.