వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌.. పొందడం ఎలా?

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్‌ వార్షిక టోప్‌ పాస్‌లను అందించనుంది. ఈ పాస్‌ వాణిజ్య వాహనాలకు వర్తించదు. దీని నిబంధనలు ఏంటో తెలుసుకుందాం

వార్షిక టోల్ పాస్ (ATP)తో ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది. కొత్త వ్యవస్థ ఆగస్టు 15 నుండి ప్రారంభమవుతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా తన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వార్షిక టోల్‌ పాస్‌తో 200 ట్రిప్పుల వరకు మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది. దీనిపై అపరిమిత ప్రయాణానికి వర్తించదు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ Xలో చేసిన ప్రకటన ప్రకారం.. రూ. 3,000 పాస్ ఒక సంవత్సరం లేదా గరిష్టంగా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. మరి డ్రైవర్ 210వ ట్రిప్ చేస్తే అతను టోల్ చెల్లించాల్సి ఉంటుందా లేదా మరేదైనా ఎంపిక ఉంటుందా? తెలుసుకుందాం.


NHAI ప్రకారం.. వార్షిక టోప్‌ పాస్‌ (ATP) ధర రూ. 3,000. ఒక సంవత్సరం చెల్లుబాటు లేదా 200 ట్రిప్పుల పరిమితితో ఉంటుంది. ఈ పథకం NHAI నిర్వహించే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వర్తిస్తుంది. అయితే, దేశంలో కొత్త వ్యవస్థ వర్తించని అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. డ్రైవర్లు దీనిని గుర్తుంచుకోవాలి.

200 ట్రిప్పులు పూర్తి చేసిన తర్వాత ఏమి చేయాలి?

NHAI ప్రకారం.. ఈ పాస్ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు చెల్లుతుంది. ఎవరైనా హైవే గుండా రోజూ వెళ్లి నాలుగు నెలల్లో 200 ట్రిప్పులు పూర్తి చేస్తే వారు మళ్ళీ వార్షిక టోప్‌ పాస్‌ తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో మూడు వార్షిక పాస్‌లను తీసుకోవచ్చు. దీనిపై ఎటువంటి పరిమితి లేదు. ఒక డ్రైవర్ తనకు కావలసినన్ని ఏటీపీలను తీసుకోవచ్చు.

200 కంటే తక్కువ ట్రిప్పులు ఉంటే?

ఒక డ్రైవర్ వార్షిక టోల్‌ పాస్‌ తీసుకొని నేషనల్ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై తక్కువ ప్రయాణించి 200 ట్రిప్పులు పూర్తి చేయకపోతే అందులో మిగిలి ఉన్న డబ్బు తిరిగి వెనక్కి రాదు. అలాగే బదిలీ చేయడం అంటూ ఉండదు. మిగిలిన మొత్తం డబ్బు లాప్స్ అవుతుంది. అందుకే దానిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

పాస్‌ను ఎక్కడ యాక్టివేట్ చేయాలి?

వార్షిక టోల్ పాస్‌ను యాక్టివేషన్ చేయడం, పునరుద్ధరించడం అనేది ప్రభుత్వం త్వరలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్, MoRTH, NHAIకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచే ప్రత్యేక లింక్ ద్వారా సాధ్యమవుతుంది. యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులు వారి వాహన వివరాలు, FASTag IDని అందించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.