ఈ ప్లాన్‌తో జియో​ సిమ్‌ ఏడాదంతా యాక్టివ్‌..

దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. ఈ టెలికాం ఆపరేటర్‌కు  47 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. కొంత మంది యూజర్లకు నెలా నెలా రీచార్జ్‌ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒకే సారి దీర్ఘకాలిక రీచార్జ​్‌ ప్లాన్ల కోసం చూస్తుంటారు. ఇటువంటి వినియోగదారుల కోసం ఇప్పుడు జియో పోర్ట్ ఫోలియోలో ఒక ప్లాన్ కూడా ఉంది.  ఇది ఒక రీఛార్జ్ తో మీ జియో సిమమ్‌ను 365 రోజులు యాక్టివ్ గా ఉంచుతుంది.


365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఇదే.. 
రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారినప్పటి నుండి  మొబైల్ వినియోగదారులలో లాంగ్ వాలిడిటీ ఉన్న ప్లాన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఇప్పుడు ఒక్క ప్లాన్ తీసుకోవడం ద్వారా ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ నుంచి విముక్తి పొందవచ్చు.  జియో అందిస్తున్న 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.3599. ఈ ప్లాన్‌తో ఏయే ప్రయోజనాల లభిస్తాయో​ ఇక్కడ తెలుసుకుందాం..

ప్లాన్‌ ప్రయోజనాలు
జియో రూ.3599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. 365 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది.  ఉచిత కాలింగ్‌తోతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా చేసుకోవచ్చు.  మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడితే, తక్కువ డేటా లిమిట్ ఉన్న ప్లాన్ సరిపోకపోతే, జియో ఈ వార్షిక ప్లాన్ మీ టెన్షన్ కు ముగింపు పలకబోతోంది. ఈ రూ.3599 ప్లాన్‌లో మీకు 912 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది.

ఈ వార్షిక ప్లాన్‌లో రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్పేస్ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. మీరు టీవీ ఛానల్స్ చూస్తున్నట్లయితే, జియో టీవీ ఉచిత సదుపాయం కూడా ఇందులో ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.