శరీరంలో వేడి చాలామందికి చేస్తూ ఉంటుంది. శరీరంలో వేడి తగ్గాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు ఎప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు.
కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్న శరీరంలో వేడి చేస్తుంది. అలాంటివారు ఏమి తినాలన్నా కాస్త భయపడతారు ఆలోచనలో పడతారు. నాన్ వెజ్ తింటే చాలామందికి వేడి చేస్తుంది. చికెన్, గుడ్లు, చేపలు ఇలా ఎలాంటి ఆహారం తీసుకున్న వేడి చేస్తుంది. తర్వాత వేడి తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే శరీరంలో వేడి తగ్గాలంటే కొన్ని రకాల ఆహార నియమాలను పాటించినట్లయితే శరీరంలో వేడి తగ్గుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. శరీరంలో వేడి తగ్గాలంటే నీరు ఎక్కువగా తాగాలి. రోజులో కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగినట్లయితే శరీరంలో వేడి సులభంగా తగ్గుతుంది. శరీరంలో వేడి చేసిన సమయంలో కొబ్బరినీళ్లు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీరు తాగినట్లయితే శరీరం అంతా చల్లగా మారుతుంది. కడుపులో హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసెడు దానిమ్మ జ్యూస్ తాగినట్లయితే శరీరంలో వేడి తగ్గుతుంది. దోసకాయ చలువ పదార్థం ఇది తిన్నట్లయితే శరీరంలో వేడి వేగంగా తగ్గిపోతుంది. దోసకాయ జ్యూస్ తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయ తింటే శరీరంలో వేడి చాలా తొందరగా తగ్గిపోతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. దానివల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. గసగసాలను పొడి చేసి పాలలో కలుపుకొని తాగినట్లయితే శరీరంలో వేడి వేగంగా తగ్గుతుంది. పెరుగు లేదా మజ్జిగ తాగినా తిన్నా శరీరంలో వేడి వేగంగా కరిగిపోతుంది. ఇవన్నీ కూడా శరీరంలో వేడిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
































