ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. ఈ నేపథ్యంలో చాలా బైక్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ కనెక్టవిటీతో పాటు టచ్ స్క్రీన్ సదుపాయంతో బైక్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యువతను అమితంగా ఆకర్షిస్తున్న సూపర్ బైక్‌లు టచ్ స్క్రీన్ ఫెసిలిటీతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బజాజ్ డామినార్ 400 బైక్ రూ.2.38 లక్షల ధరతో లాంచ్ చేశారు. ఈ బైక్ డాట్-మ్యాట్రిక్స్ ఎల్సీడీ/టీఎఫ్టీ -శైలి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది బజాజ్ రైడ్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. కాల్/ఎస్ఎంఎస్ హెచ్చరికలు, సంగీత నియంత్రణకు మద్దతు ఇస్తుంది. బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో, డిస్ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్ సూచనలను అందిస్తుంది. రైడర్లు రైడ్ చేసే సమయం, సగటు ఇంధన సామర్థ్యం, ల్యాప్ టైమర్ వంటి రియల్ టైమ్ గణాంకాలను యాక్సెస్ చేయవచ్చు. ఈ బైక్ 373.3cc లిక్విడ్-కూల్డ్ సింగిల్- సిలిండర్ ఇంజిన్‌తో ఆకర్షిస్తుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ రూ 1.81 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. 4.2 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు హీరో కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. అందువల్ల కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, ఫోన్ బ్యాటరీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. క్లస్టర్ రియల్-టైమ్ ఇంధన సామర్థ్యం, గేర్ షిఫ్ట్‌లు, తక్కువ-ఇంధన హెచ్చరికలు, యాంబియంట్ లైట్ సర్దుబాట్లను కూడా ప్రదర్శిస్తుంది. ఈ బైక్ 124.7 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రైడర్లకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
హెూండా ఎన్ఎక్స్ 200 బైక్ రూ. 1.69 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌లో పాత ఎల్సీడీ సెటప్ స్థానంలో 4.2 అంగుళాల ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. హెూండా రోడిసింక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. అలాగే కాల్/ఎస్ఎంఎస్ అలెర్ట్స్, సంగీత కంట్రోల్, ఫోన్ బ్యాటరీ స్టేటస్‌ను కూడా చూపుతుంది. అయితే టర్న్- బై-టర్న్ నావిగేషన్‌తో పాటు 184.4 సీసీ ఎస్ఐ ఇంజిన్‌తో ఆకట్టుకుంటుంది.
కేటీఎమ్ 390 డ్యూక్ బైక్ రూ.2.96 లక్షల ధరతో లాంచ్ చేశారు. ఈ బైక్‌లో డ్యూక్ రేస్-ఫోకస్డ్, బ్లూటూత్-ఎనేబుల్డ్ 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. అలాగే కేటీెం కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేసి హ్యాండిల్ బార్ స్విచ్‌ల ద్వారా కాల్/మెసేజ్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్‌ను ఎనేబుల్ చేయవచ్చు. డౌన్లోడ్ చేసిన మ్యాప్‌లతో టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందుబాటులో ఉంది 398.63 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకత.
టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 310 బైక్ రూ.2.49 లక్షల ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్‌తో బ్లూటూత్-ఎనేబుల్డ్ 5 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్టీ రేస్ కంప్యూటర్ స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది. టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా మీ ఫోన్‌కు ఈ స్క్రీన్ లింక్ అవతుంది. ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ ద్వారా కచ్చితమైన టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందిస్తుంది. ఈ బైక్ 312.2 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఆకర్షిస్తుంది.
































