ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే టాక్ నడుస్తూనే ఉంది. వాళ్లు కలిసి కనిపిస్తూనే ఉన్నరు. ఫంక్షన్స్, ఈవెంట్స్‌లో ఎంజాయ్ చేస్తూ..
సెల్ఫీలు తీసుకుంటూ రూమర్స్‌కు చెక్ పెడుతూనే ఉన్నరు. కానీ గాసిప్స్ మాత్రం ఆగట్లేదు. ఇద్దరిలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా.. డివోర్స్‌కు లింక్ చేసేస్తున్నరు. అయితే ఈ విడాకుల కథ ఇలా కొనసాగుతూనే ఉండగా.. అసలు ఐశ్వర్య కన్నా ముందు ఓ స్టార్ హీరోయిన్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా సెలెక్ట్ అయిందనే విషయం ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది.
అవును.. ఆ టైంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన కరిష్మా కపూర్.. అభిషేక్ బచ్చన్‌ను లవ్ చేసింది. వీరి ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత చివరకు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యే లోపే.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నెల రోజుల లోపే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది బచ్చన్ ఫ్యామిలీ. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన కరిష్మ.. దాని నుంచి బయటపడేందుకు చాలా టైమ్ తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని బాధపడింది. తన తల్లి, చెల్లి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లే మళ్లీ ముందుకు సాగానని.. టైమ్ హీల్ చేసిందని తెలిపింది.
































