ప్రధాని మోదీ ఇటీవల జీ 7 సదస్సు నుంచి అర్ధంతరంగా తిరిగి మనదేశానికి వచ్చేశారు. అంతేకాకుండా..
ఆయన బీహర్ కు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు వచ్చారు. అయితే.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో మోదీ ఒడిశాలో..రూ. 18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులనున ప్రారభించారు. ఒడిశాకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు.
ఈ క్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. తాను జీ 7 సదస్సు నుంచి భారత్ కు వస్తుండగా.. ట్రంప్ నుంచి కాల్ వచ్చిందని, వాషింగ్టన్ కు వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్లాలని కోరారని మోదీ చెప్పారు. అయితే.. తాను మాత్రం ట్రంప్ ఇన్విటేషన్ ను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఈ క్రమంలో దీని వెనుకాల అసలు కారణం ఏంటదని కూడా చెప్పారు.
తనకు ఒడిశా జగన్నాథుడి కొలువైన రాష్ట్రంలో పలు డెవలప్ మెంట్ పనులు చేయాలని ఆ దేవుడు నాకు బాధ్యతలు అప్పగించాడు. మాకు ఇది ముఖ్యం. ఒకవేళ తాను అమెరికా వెళ్లి ఉంటే.. ఈ కార్యక్రమంలో వచ్చే అవకాశం కోల్పోయే వాడినన్నారు. అందుకు.. ట్రంప్ కన్నా కూడా.. జగన్నాథుడు, నా ప్రజలు, నా దేశం ముఖ్యమని కూడా మోదీ చెప్పుకొచ్చారు.
అదే విధంగా ఒడిశా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూరీ రహస్యరత్న భాండాగారం సైతం.. తెరిచి ఒడిశా ప్రజల కోరికల్ని నెరవేర్చామన్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని మోదీ బైటకు చెప్పడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు ఇటీవల మోదీ ట్రంప్ కు పంచ్ ల మీద పంచ్‌లు ఇస్తున్నారని దీన్నిబట్టి మనకు తెలుస్తుంది.
ఇటీవల మోదీ మాట్లాడుతు.. పాక్ తో తమకు మధ్య ఉన్న కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం అవసరంలేదని స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ తో అపోసిషన్ పార్టీలకు మోదీ గట్టి కౌంటర్ తో పాటు.. ట్రంప్ కు కూడా ఝులక్ ఇచ్చినట్లైంది.. కానీ ట్రంప్ మాత్రం ఎప్పుడు ఏంమాట్లాడతారో అని అందరు వింతగా ఆయన్ను సొషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
































