Two Wheeler ABS: ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రతి టూ వీలర్కు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్), రెండు హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.


ఈ మేరకు త్వరలోనే కేంద్ర ట్రాన్స్ఫోర్టు మంత్రిత్వ శాఖ నుంచి నోటీఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తద్వార టూవీలర్ ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.దీనికి సంబంధించి కేంద్ర ట్రాన్స్ఫోర్టు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్దంగా ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నిజానికి ఇప్పటికీ ఏబీఎస్ విధానం ఉన్నప్పటికీ అది కేవలం 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్ధ్యం ఉన్న టూవీలర్లకు మాత్రమే తప్పనిసరి చేశారు. అయితే దీన్ని ఈసారి ప్రారంభస్థాయి మోడళ్లతో పాటు అన్ని టూవీలర్లకు వర్తంచేలా చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో 75 శాతం వాహనాలు ఈ ఎంట్రీలెవల్ మోడళ్లే . 2022 లెక్కల ప్రకారం ప్రస్తతం జరగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు టూవీలర్ మూలంగానే జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల టూవీలర్లకు ఎబీఎస్ విధానం తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రమాదాలను నివారించడంలో ఏబీఎస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల సడన్ బ్రేకింగ్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా నిరోధిస్తుందని ట్రాన్స్ ఫోర్టు వర్గాలు చెబుతున్నాయి. దీనివ్ల వాహనం మీద డ్రైవర్ నియంత్రణ కలిగి ఉండటంతో పాటు వాహనం స్కిడ్ కాకుండా నివారిస్తోందని వారు పేర్కొంటున్నారు.

ఇక టూవీలర్లకు ఏబీఎస్ నిబంధనను తప్పనిసరి చేస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలకు ఏబీఎస్ను అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని తద్వారా వాహన ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. పెరిగిన భారాన్ని కంపెనీలు వినియోగదారులపైనే వేయడానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవల్ టూవీలర్ మోడళ్లపై ధరలు రూ.2500 నుంచి రూ.5వేల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో టూ వీలర్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వాహనంపై ప్రమాణించే ఇద్దరూ హెల్మెట్లు కలిగి ఉండాలనే నిభంధనను కూడా అమల్లోకి తేవడానికి కేంద్రం సిద్దమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.