రైతుల ఖాతాల్లోకి 2వేల రూపాయలు – “పీఎం కిసాన్” నిధుల విడుదల ఎపుడో తెలుసా?

రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ (PM Kisan) నిధులు నేడో, రేపో విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 19సార్లు నిధులు మంజూరు కాగా, తాజాగా 20వ సారి రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. కిసాన్ సమ్మాన్ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించగా గత 19 విడుతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బు నమోదైంది. 18 విడుతల్లో 11 కోట్ల మంది రైతులకు రూ.3.46లక్షల కోట్లు లబ్ధి చేకూరింది. 19వ విడుత కిసాన్ సమ్మాన్ నిధులను బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నిధులు విడుదల చేయగా రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.


కిసాన్ సమ్మాన్ నిధులు ఏటా 6వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తొలి విడత నిధులు ఏప్రిల్ – జూలై, రెండో విడత నిధులు ఆగస్టు – నవంబర్, మూడో విడత నిధులు డిసెంబర్ నుంచి మార్చిలోపు జమకానున్నాయి. తాజాగా 20వ విడుత నిధులను సైతం నేడు బిహార్​లోని సివాన్ లేదా ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగే కార్యక్రమంలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

డ‌బ్బు ఖాతాలో పడిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.

  • ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
  • కుడి వైపు ఆప్ష‌న్ల‌లో బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్ష‌న్ ఉంటుంది
  • సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ఆధార్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి.
  • స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే ఖాతాలో డ‌బ్బు జమ అవుతుంది.
  • అలాగే ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా ఇక్కడే పరిశీలించుకోవచ్చు.
  • బెనిఫిషియ‌రీ స్టేట‌స్ కింద బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
  • ఈ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ ఎంచుకుని గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేస్తే చాలు జాబితా, లబ్ధిదారుల పేర్లు కనిపిస్తాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.