మిడిల్ రేంజ్ బడ్జెట్ కార్లకు మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా రూ.7 లక్షల లోపే ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మిడిల్ క్లాస్ వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే టాటా కంపెనీ నుంచి మొదలుకొని మారుతి కంపెనీ వరకు ప్రతి ఒక్క ఆటోమొబైల్ కంపెనీ మిడిల్ బడ్జెట్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు విడుదల చేసిన కార్లకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది.
ముఖ్యంగా చాలామంది గతంలో మార్కెట్లోకి విడుదలైన Maruti Fronx, Toyota Taisor కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కార్లలో చాలావరకు తేడాలని చూసి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండిట్లో ఫీచర్స్, ధర, స్పెసిఫికేషన్స్, మైలేజీ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండు కార్లలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
ఇక Maruti Fronx, Toyota Taisor కార్లకు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. ఇందులోని మారుతి Fronx కారు ధర రూ.7.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక టయోటా కంపెనీ Taisor ధర రూ.7.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ధర పరంగా చూస్తే మారుతి కంపెనీ కారు ధర కాస్త ఎక్కువగా చెప్పవచ్చు.
ఇక ఈ రెండు కార్లకు సంబంధించిన ఇంజన్స్ వివరాల్లోకి వెళ్తే..ఇందులోని రెండు మోడల్స్ 1197 cc పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి రెండు సుమారు 28.5 కిమీ/కేజీ మైలేజీని అందిస్తాయి. ఇవి రెండిట్లో వాటి కంపెనీలకు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.
ఇక ఈ రెండు కార్లకు సంబంధించిన బూట్ స్పేస్, తదితర వివరాల్లోకి వెళితే.. ఈ రెండు కార్లు 308 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటాయని సమాచారం. అంతేకాకుండా వీటి పరిమాణం కూడా సేమ్ టు సేమ్ ఉంటున్నట్లు తెలుస్తోంది.
రెండు (Maruti Fronx, Toyota Taisor) మోడల్స్‌లో అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్‌లు, ఇంటిగ్రేటెడ్ యాంటెనాలు వంటి బాహ్య ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కార్లు దాదాపు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ కారును కొనుగోలు చేయొచ్చు..

































