ఈ ఏఐ యాప్.. ఇంగ్లీష్‌ మాట్లాడడం నేర్పిస్తుంది.. ఫీడ్బ్యాక్ ఇస్తుంది

ప్పుడు చాలామంది అందుబాటులో ఉన్న సోర్స్‌తో ఈజీగా ఇంగ్లీష్‌ నేర్చుకోగలుగుతున్నారు. కానీ.. ఏ పదాన్ని ఎలా పలకాలో తెలియక మాట్లాడలేకపోతుంటారు. అలాంటి వాళ్లకు ఎల్సా ఏఐ సాయం చేస్తుంది.


ఇది ఇంగ్లీష్​ పదాల ఉచ్ఛారణ, గ్రామర్‌, స్పీకింగ్‌ స్కిల్స్‌ నేర్పించే ఏఐ బేస్డ్‌ మొబైల్ యాప్. యూజర్ల మాటలను రికార్డు చేసి డీప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వాయిస్‌ రికగ్నిషన్‌ సాయంతో వాటిని విశ్లేషిస్తుంది. పదాలు, పదబంధాలను ఎలా వాడుతున్నామో, ఎలా ఉచ్ఛరిస్తున్నామో వివరిస్తుంది.

ఇది తెలుగు సహా 44 భాషల్లో వివరణలు, ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వగలదు. ఈ యాప్‌లో 8,000కు పైగా లెసన్స్ ఉన్నాయి. జాబ్ ఇంటర్వ్యూలు, టోఫెల్‌ లాంటి ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌తోపాటు ఐవోఎస్‌లో కూడా అందుబాటులో ఉంది. కాకపోతే.. ఫ్రీ వెర్షన్​లో కొన్ని ఫీచర్లు మాత్రమే ఉంటాయి. అన్ని ఫీచర్లు కావాలంటే ప్రో వెర్షన్ కొనుక్కోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.