కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలని చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయాడు.
శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకుని చిన్న చిన్నపాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతో హీరోగా తెలుగు, తమిళ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళ,కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు శ్రీరామ్. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లోను అలరించాడు.
ఇదిలా ఉండగా ఈ సీనియర్ నటుడిని డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్‌కు శ్రీరామ్ ను తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ యూనిట్ పోలీసులు. మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో అన్నా డీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలిసులు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు సినిమాలో జీవాతో పాటు కలిసి నటించాడు శ్రీరామ్. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.



































