నేరేడు పండ్లు తిన్న తర్వాత ఇవి తినొద్దు..

ఇటీవల ఒక భవిష్‌ అనే ఒక కుర్రాడికి కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. అతని కడుపు బాగా బిగుసుకుపోయింది. దీంతో అతను ఊపిరాడనంత పనైంది.


వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో నేరేడు పండు తర్వాత అవి తినడం వల్లనే ఇలా జరగిందని డాక్టర్లు చెప్పారు. ఇంతకీ డాక్టర్లు నేరేడుపండు తిన్న తర్వాత ఏం తినొద్దు అన్నారు. చూద్దాం.

నేరేడు పండు తిన్న తర్వాత పాలు, పాలకు సంబంధించిన పదార్ధాలు తినడం, నీళ్లు, మసాలాలు, స్పైసీ ఆహారాలు వంటి తినడం వల్ల జీర్ణసమస్యలు తలెత్తుతాయి. దీంతో కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటివి రావొచ్చు.

తింటే..ఏం జరుగుతుంది?

పాలు

నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అలాగే పాలతో తయారుచేసినేవీ తినకూడదు. ఒకవేళ తింటే అవి జీర్ణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ పెరగడం, ఊపిరి తీసుకోకపోవడం, అన్ ఈజీనెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

మసాలా

ఈ పండ్లు తిన్న తర్వాత మసాలా వేసిన పదార్దాలేవీ తినకూడదు. చికెన్, మటన్ వంటి కూరలు, బిర్యానీలు, మసాలా వంటకాలేవీ తినకుండా ఉంటేనే మంచిది. దీనివల్ల కూడా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

నీళ్లు

నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. దాదాపు అరగంట లేదా 40 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి.

ఆవగాయ పచ్చడి

ఆవపిండి వేసిన ఏ పచ్చళ్లను నేరేడుపండ్లు తిన్న వెంటనే తినకూడదు. దీనివల్ల జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

స్పైసీ ఫుడ్

నేరేడు పండ్లు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్ తింటే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

ఎప్పుడు తినాలి?

నేరేడుపండ్లలో ఆమ్ల గుణం ఎక్కువగా దీనివల్ల పై ఆహార పదార్దాలు తీసుకుంటే కడుపులో ఆ పదార్దాలు విరిగిపోతాయి. దీనివల్లే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే నేరేడు పండ్లు ఎప్పుడూ ఉదయాన్నేతింటే మంచిది. అదేవిధంగా లంచ్, డిన్నర్ పూర్తియిన ఒక గంట లేదా రెండు గంటల తర్వాత తింటే బెటర్. అయితే, భవిష్‌ నేరేడుపండ్లు తిన్న వెంటనే పాలు తాగాడు. దీనివల్ల అతని కడుపులోపల ఉబ్బరం మొదలయింది. దీంతో ఊపిరి సరిగా తీసుకోలేకపోయాడు.

అయితే కొన్ని పండ్లు తినాలనుకున్నప్పుడు అలాగే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే తినాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.