ఈ మధ్య ఎవరిని చూసినా.. తాము క్రాక్స్ చెప్పులే ఎక్కువగా ధరిస్తామని చెబుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లకు, ఇంట్లో వేసుకునే చెప్పుల నుంచి ఆఫీస్‌లకు వేసుకునే చెప్పుల వరకు అన్ని రకాల చెప్పులు అన్ని వయసుల వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి.
అయితే ఇలా రెగ్యులర్‌గా క్రాక్స్ చెప్పులు వాడితే మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు. ఇప్పుడు చూద్దాం.
క్రాక్స్ చెప్పులు అందరూ వాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. ఇవి చాలా లైట్ వెయిట్. అంతేకాదు వేసుకుంటే చాలా కంఫార్ట్‌గా ఉంటాయి, అదేవిధంగా వాషుబుల్కూడా. వాకింగ్‌లకు వెళ్లేటప్పుడు, జిమ్‌లకు వెళ్లేటప్పుడు వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఇవి కొంతమందికి పడుతున్నాయి. మరికొంతమందికి పడడం లేదు. అయితే ఇవి పడనివాళ్లు వీటిని ఎక్కువ సేపు కాళ్లకు వేసుకుని ఉంచడం వల్ల పాదాలు ఎరుపెక్కడం, బొబ్బలు వంటివి వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఈ చెప్పులు వేసుకున్నప్పుడు మడమకు మద్దతు ఉండదు. దీంతో నడిచేటప్పుడు ఈ చెప్పులు అసౌకర్యంగా ఉంటాయి. ఒక్కోసారి జారిపడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ చెప్పులు వేసుకున్న తర్వాత కంఫార్ట్ గా లేకపోతే మానేయడమే మంచిది.
ఈ చెప్పులు ప్లాస్టిక్‌తో తయారుచేస్తారు. దీంతో చెప్పుల లోపల చెమట చేరుకుంటుంది. దీనివల్లన చిరాకు, దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
చెప్పుల నుండి వచ్చే ఘర్షణ, గాలి తగలకపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీంతో మడమలు పగిలిపోయే అవకాశం ఉంది.
కొన్ని సార్లు ఈ చెప్పులు నొప్పిని కూడా కలిగిస్తాయి. అలాగే చర్మంపై రాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అన్నీ చెప్పులు ఇలా ఉండవు. అందుకే శరీరాన్ని బట్టి కూడా చెప్పులు ఎంపిక చేసుకోవాలి.
































