అహ్మదాబాద్ ప్రమాద విమాన శకలాలు తరలిస్తుండగా మరో ప్రమాదం

ఈ నెల 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) టేకాఫ్ అయిన 36 సెకన్లలోనే మేఘనీ నగర్‌లోని ఒక మెడికల్ హాస్టల్‌పై కూలిపోయింది.


ఈ ప్రమాదంలో మొత్తం 272 మంది మృతి చెందారు. నేటికి వారిలో కొంత మంది మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ విమాన ప్రమాదం అనంతరం అన్ని దర్యాప్తు సంస్థలు పరిశీలించిన తర్వాత ప్రమాద స్థలం నుంచి విమాన ప్రమాదంలోని మాల్వా(ముక్కలు)లను తరలించే ప్రక్రియ కొనసాగించారు.

అయితే ప్రమాద విమాన శకలాలను తరలిస్తున్న క్రమంలో మరోసారి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న విమానం యొక్క మల్వాను తరలించే ప్రక్రియలో ఒక ట్రక్కు ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో విమానం యొక్క తోక భాగం (టెయిల్ సెక్షన్) అహ్మదాబాద్‌లోని షాహీబాగ్ డఫనాలా నుంచి క్యాంప్ హనుమాన్ మందిరం వరకు వెళ్తుండగా ఒక చెట్టుతో ఢీకొంది. ఈ ఘటన వల్ల ఆ రహదారి రెండు గంటల పాటు మూసివేయబడింది. పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. అయితే ఈ ప్రమాదం తరలింపు ప్రక్రియ లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిన లోపంగా అధికారులు గుర్తించారు.

అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు నమోదు కాలేదు. మల్వా తరలింపు ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని, విమానం యొక్క ముక్కలను సేకరించి, విశ్లేషణ కోసం తగిన స్థలానికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియలో రన్‌వే ఉపరితలం నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నారు, ఇవి ప్రమాద కారణాలను గుర్తించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. అయితే తరలింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. “ఒకప్పుడు ఆకాశంలో ఎగిరిన వారు ఇప్పుడు నేలపై నడవలేని స్థితికి చేరుకోవడం కాలానికి సంబంధించిన విషయం.ఈ వీడియో ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదని మనకు నేర్పుతుంది.” అని రాసుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.