షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలు తినొచ్చా.. లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

బంగాళాదుంపలు వండటానికి సులువుగా ఉంటాయి. రుచికరంగా కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిని ఇష్టపడతారు. అయితే ఆరోగ్యానికి ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఇవి మంచివా కాదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై పోషక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.


బంగాళాదుంపలలో స్టార్చ్ అనే పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఉడికించినా లేదా వేయించినా ఈ పిండి పదార్థం శరీరంలోకి త్వరగా చేరి గ్లూకోజ్‌ గా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే షుగర్ జబ్బు ఉన్నవారు బంగాళాదుంపలను పూర్తిగా తినడం మానేయకపోయినా.. తక్కువ మోతాదులో మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగాళాదుంపలు ఆరోగ్యానికి పూర్తిగా చెడు అని చెప్పడం సరికాదు. వాటిని ఎలా వండుతున్నాం అనేది ముఖ్యం. ఉదాహరణకు బంగాళాదుంపలను నూనె లేకుండా కాల్చడం లేదా తక్కువ నూనెతో గ్రిల్ చేయడం మంచి పద్ధతులు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కొవ్వు చేరదు.. పోషకాలు కూడా కొంతవరకు అలాగే ఉంటాయి. అయినప్పటికీ షుగర్ ఉన్నవారు వీటిని తరచుగా లేదా ఎక్కువ మొత్తంలో తినడం మాత్రం మానేయాలి.

బంగాళాదుంపలకు బదులుగా చిలగడదుంపలు తినడం చాలా మంచిది. వీటిలో షుగర్ పెంచే గుణం తక్కువగా ఉంటుంది. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్నవారికి చిలగడదుంపలు ఒక మంచి ప్రత్యామ్నాయం.

మనం తినే ఆహారం సరైన మోతాదులో, సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచి చేస్తుంది. బంగాళాదుంపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ స్థాయి పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.