మళ్లీ తెలంగాణకు IAS ఆమ్రపాలి

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి(Amrapali IAS)కి క్యాట్(CAT) శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి తిరిగి మళ్లీ తెలంగాణకు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


కాగా, కొన్నినెలల క్రితం ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆమ్రపాలి కాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.