‘కన్నప్ప’ సెన్సార్‌ రిపోర్టు.. రన్‌టైమ్‌ ఎంతంటే?

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్ర పోషించిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.


సెన్సార్‌ అనంతరం ఈ సినిమా రన్‌టైమ్‌ 182 నిమిషాలు (3 గంటల 2 నిమిషాలు). 195 నిమిషాలతో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్‌ బోర్డు 12 కట్స్‌ చెప్పగా.. ఆ మేరకు చిత్ర బృందం మార్పులు చేసింది. రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం, తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్స్‌, మూడు పాటల్లోని విజువల్స్‌ తదితర వాటిని తొలగించారు.

    అడ్వాన్స్‌ బుకింగ్స్‌ (తెలుగు) బుధవారం నుంచి ప్రారంభమవుతాయని విష్ణు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. శివ భక్తుడు కన్నప్ప జీవితాధారంగా విష్ణు ఈ సినిమా కథ రాశారు. దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కించారు. తిన్నడు/కన్నప్పగా విష్ణు నటించగా రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు. ఇంతమంది స్టార్స్‌ నటించడం, ‘భక్త కన్నప్ప’ (కృష్ణంరాజు) సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు కన్నప్ప కథ తెరపైకి వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.