కోటి రూపాయలు విలువ 20 ఏళ్లలో రూ.25 లక్షలకు పడిపోయింది..కారణం తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే

ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడం. దీంతో మీ డబ్బు విలువ ఏడాదికేడాది తగ్గిపోతుందని ఎప్పుడైనా గమనించారా.. వస్తువులు, సేవల ధరలు పెరగడం మూలంగా మీ డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతూ..తగ్గిపోతుందనే నిజాలు తెలిస్తే మీరు గుండెలు బాదుకుంటారు.. ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎంతలా తగ్గిస్తుందంటే..20 ఏళ్ల క్రితం మీ వద్ద కోటి రూపాయలు ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ. 25 లక్షలకు తగ్గిపోయింది. ఇది నమ్మలేని నిజం..కాని నమ్మి తీరాల్సిన నిజం..


దీనికి ఉదాహరణగా చూసుకుంటే.. నేడు 7 శాతం ద్రవ్యోల్బణ రేటు వద్ద రూ. 1 కోటి విలువైన డబ్బు 20 సంవత్సరాలలో కేవలం రూ. 25.84 లక్షలు మాత్రమే అవుతుంది. అంటే మీరు నేడు రూ. 1 కోటి ఖరీదు చేసే వస్తువును 20 సంవత్సరాల తర్వాత కొనాలనుకుంటే మీకు రూ. 4 కోట్లు అవసరం అవుతాయి. అంటే దాదాపు మీరు రూ. 3 కోట్లు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అంటే, మీరు ఒకే మొత్తంలో డబ్బుతో గతంలో కొన్న వస్తువులను ఇప్పుడు కొలేకపోవడమేనని చెప్పుకోవచ్చు.

దీనికి మరో ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే.. విజయ్ అనే వ్యక్తి 2005లో ఉద్యోగంలో చేరాడు అనుకుందాం. అప్పుడు అతని నెల జీతం అప్పుడు 20 వేలు అనుకుంటే..అది అతని కుటుంబ ఖర్చులకు సరిపోయేది.. అయితే 20 ఏళ్ల తరువాత అతని జీతం లక్ష రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు అయిదింతలు పెరిగింది.అయినా ఆ డబ్బులు అతని కుటుంబ అవసరాలకే సరిపోతున్నాయి. దీనికి కారణం ద్రవ్యోల్బణం అని చెప్పుకోవచ్చు. అంటే అతని జీతంతో పాటు వస్తువల ధరలు కాలక్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఎంత సంపాదించినా అది అవసరాలకే సరిపోతోంది. ద్రవ్యోల్బణం అంటే పైన చెప్పుకున్నట్లు వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడం.. అంటే, మీరు ఒకే మొత్తంలో డబ్బుతో గతంలో కొన్న వస్తువులను ఇప్పుడు కొలేకపోవడంగా చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 7% ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటే..రాబోయే 20 సంవత్సరాలలో ఖర్చులు ఎలా ఉంటాయో ఓ అంచనా వేసుకుంటే..

పాఠశాల ఫీజులు: ఇప్పుడు సంవత్సరానికి రూ. లక్ష అనుకుంటే.. అది కాస్తా 20 ఏళ్ళకు రూ. 3.87 లక్షలకు పెరుగుతుంది. వైద్య ఖర్చులు: ఈ ఏడాది రూ. 5 లక్షల విలువైన చికిత్సను తీసుకుంటే అది కాస్తా 20 ఏళ్ళ దాటేసరికి రూ. 19.35 లక్షలకు చేరుతుంది. నెలవారీ గృహ ఖర్చు: ఇది ఇప్పుడు రూ. 50,000 ఉందనుకుంటే.. 20 సంవత్సరాలలో అది కాస్తా పెరిగి రూ. 1.93 లక్షలకు చేరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే సేవింగ్ ఆలోచన భవిష్యత్తులో ఓ మూలకు కూడా రాకపోవచ్చు.. మీరు 20 ఏళ్లలో పదవి విరమణ చేసిన తర్వాత కోటి రూపాయలతో ఆనందంగా గడిపేయవచ్చనుకుంటే అంతకన్నా తెలివి తక్కువ తనం మరొకటి ఉండదు. ఆ డబ్బులు అప్పుడు ఓ మూలకు కూడా రాకపోవచ్చు.

చాలామంది తమ పెట్టుబడులు 7 శాతం రాబడి ఇస్తున్నాయని ఎగిరి గంతేస్తుంటారు. అయితే అది కేవలం వారి భ్రమ మాత్రమే. ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటే మీకు వచ్చే ఆదాయం కూడా గుండు సున్నాగా ఉంటుంది. దీనికి మరొక ఉదాహరణ ఏంటంటే.. 2010లో కేజి బియ్యం ధర 20 రూపాయలు అనుకుంటే..ఇప్పుడే అది ఏకంగా 70 రూపాయలు దాటింది. మీరు మంచి బియ్యం కొనుగోలు చేయాలనుకుంటే ఏడుశాతం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే వస్తువు రేటు 15 ఏళ్లలోనే 5 శాతానికి పైగా పెరిగింది. అదే స్థాయిలో మీ జీతం పెరగలేదు..కాబట్టి మీరు ద్రవ్యోల్బణం ఎదుర్కుని మీరు ఎంత సంపాదించినా పేదవారిగానే మిగిలిపోతున్నారు. ఇన్వెస్టర్లకు అలర్ట్..ఆరు టాప్ కంపెనీలు ఈ వారం ఐపీఓలోకి వస్తున్నాయి, డబ్బు రెడీగా ఉంచుకోండి తాజా అధ్యయనాల ప్రకారం, 7% వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2005లో రూ. 1 కోటి విలువ, 2025 నాటికి కేవలం రూ.25.84 లక్షలకే తగ్గిపోయింది. అంటే మీరు ఏటా వృద్ధి చేయని డబ్బు అసలు విలువ కోల్పోతూనే ఉంటుంది.మీరు వాస్తవంగా చూస్తే..

కేవలం బ్యాంకులో డబ్బు ఉంచడం వల్ల వడ్డీ లభించొచ్చు కానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేరు. అందుకే, దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. రియల్ ఎస్టేట్, బంగారం వంటి విలువైన ఆస్తులు, స్టాక్ మార్కెట్‌కు అనుసంధానమైన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ డబ్బు విలువ పెరగడమే కాకుండా..ద్రవ్యోల్బణం గండాన్ని కూడా ఎదుర్కొనవచ్చు. ద్రవ్యోల్బణం అనేది శబ్దం లేకుండానే మన సంపదను తినేసే శత్రువు. అందుకే డబ్బును పని చేసేలా పెట్టుబడిగా మార్చుకోవాలి. మీరు సంపాదించే దానికంటే – దానిని ఎలా పెంచుతున్నారనే విషయంలో విజయం దాగి ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.