ఐటీ సెక్టార్ కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి స్టాక్ అయిన ఫోకస్ బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ కి చెందిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ వాటాదారులకి 29:50 రేషియోలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలుపడంతో పాటు దానికి సంబంధించిన రికార్డు డేట్ ని జూలై 07 గా నిర్ణయించడం జరిగింది.
స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన ఐటీ సెక్టార్ స్టాక్ అయిన ఫోకస్ బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ (Focus Business Solution Limited) తమ షేర్ హోల్డర్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజాగా కంపెనీకి చెందిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశమై తమ వాటాదారులకి 29:50 రేషియోలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలుపడం జరిగింది. అలాగే ఈ బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డు డేట్ ని జూలై 07 గా నిర్ణయించినట్లు కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది.
ఇక ఈ బోనస్ ఇష్యూ ప్రకారం, ఎవరైతే కంపెనీకి చెందిన 50 షేర్స్ ని తమ డీమ్యాట్ అకౌంట్ లో కలిగి ఉంటారో వారు ఏకంగా 29 ఈక్విటీ షేర్స్ ని బోనస్ గా పొందుతారు. కంపెనీ ఈ బోనస్ ఇష్యూ ని ప్రకటించడంతో ఈరోజు ఈ కంపెనీ షేర్ సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరొకవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాది కాలంలో సుమారు 115 శాతం లాభాన్ని తమ షేర్ హోల్డర్స్ కి అందించింది.
బోనస్ షేర్స్ :
టార్గెట్ ప్రైజ్ :
స్టాక్ పనితీరు :
ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఫోకస్ బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ షేరు ధర 3.5 శాతం లాభపడి రూ. 135 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 135 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 59.57 గా ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు 4 శాతం లాభాన్ని, అలాగే గత నెల రోజుల్లో ఈ షేరు సుమారు 16 శాతం లాభాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 38 శాతం లాభాన్ని, అదే గత ఏడాది కాలంలో సుమారు 115 శాతం లాభాన్ని, చివరగా గత నాలుగు సంవత్సరాలలో ఈ షేర్ 913 శాతం లాభాన్ని తమ వాటాదారులకి అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 62.20 కోట్లుగా ఉంది.
































